
#APSRTC NEWS : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం పథకం మొదలైంది. దీంతో మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని బాగానే సద్వినియోగం చేసుకుంటున్నారు. ఉద్యోగాలకి వెళ్ళే మహిళలు, చిరు వ్యాపారాలకు దగ్గరలోని టౌన్ లేదా సిటీలకి వెళ్ళేవాళ్ళకి ఈ ఫ్రీ బస్ పథకం బాగానే ఉపయోగ పడుతోంది.
ఐతే ఇంకొందరు మాత్రం సరదాకి ఈ ఫ్రీ బస్ సర్వీస్ ను ఉపయోగించుకుంటున్నారు. దీంతో అవసరాల నిమిత్తం ప్రయాణించే మహిళలకి ఇబ్బందిగా మారుతోంది. ఐతే రీసెంట్ గా ఓ మహిళ కేవలం తన తల్లికి ఇష్టమైన కట్లపొడి, ఆకులు, వక్కలు కొనడానికి తాడిపత్రి నుంచి అనంతపురం కి ఫ్రీ బస్ లో వెళ్ళింది. ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా సదురు మహిళ రీల్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఒక్కసారిగా నెటిజన్లు ఫైర్ అయ్యారు.
ఐతే తాజాగా కొందరు మహిళలు ఉచిత బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న ఘటన విజయవాడలో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే కొందరు మహిళలు గురువారం విజయవాడ నుంచి జగ్గయ్య పేట వెళ్లే బస్ ఎక్కారు. ఐతే అప్పటికే బస్ మహిళలతో ఫుల్ అయిపోవడంతో ఫుల్ రద్దీతో ఉంది. దీంతో ఇద్దరు మహిళలు సీటు విషయంలో గొడవపడుతూ ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని కొట్టుకున్నారు. అంతేకాదు అసభ్యకరమైన పదజాలంతో దూషణ చేసుకుంటూ గొడవపడ్డారు.. ఇది గమనించిన తోటి ప్రయాణికులు సెల్ ఫోన్ లో వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియోలు వైరల్ గా మారాయి.
https://x.com/greatandhranews/status/1958405138735124501?t=MdwdGW7Lm6ArfYSTqHVv_Q&s=19
ఈ విషయంపై కొందరు అధికారులు స్పందిస్తూ బస్సుల్లో ప్రయాణికులు కొంతమేర సంయమనం పాటిస్తూ ఓపికగా ఉండాలని కోరుతున్నారు. అలాగే సీట్లు లేని సమయంలో కొంతమేర సర్దుకుని పోవాలని, తోటి ప్రయాణికులను గౌరవించాలని సూచిస్తున్నారు.