
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే వర్షాలు భారీ ఎత్తున దంచి కొడుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండం గా మారి మళ్లీ వర్షాలకు కారణం అవుతుంది. ఈ వాయుగుండం ద్వారా మరో నాలుగు రోజులు పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో వర్షాలు కురుస్తాయని అధికారులు తేల్చి చెప్పారు. ఇక రాష్ట్రంలోని పలు జిల్లాలకు వచ్చే మంగళవారం వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాబట్టి క్రింద ఇచ్చినటువంటి ఎల్లో జిల్లాల ప్రజలు కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఎల్లో అలెర్ట్ ప్రకటించిన జిల్లాలు :-
1. ఆసిఫాబాద్
2. అదిలాబాద్
3. మంచిర్యాల
4. నిర్మల్
5. నిజామాబాద్
6. జగిత్యాల
7. సిరిసిల్ల
8. కరీంనగర్
9. వరంగల్
10. హనుమకొండ
11. సిద్దిపేట
12. జనగాం
13. వికారాబాద్
14. సంగారెడ్డి
పైన పేర్కొన్న 14 జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలెర్ట్ ప్రకటించారు. అంతేకాకుండా ఈ జిల్లాల ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని.. ఒకవేళ బయటకు వెళ్తే తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇక వాహనదారులు కూడా కాస్త అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే తక్షణమే సహాయం కోసం ఎమర్జెన్సీ నెంబర్లకు కాల్ చేయాలని తెలిపారు.
Read also : ఒకేసారి ఇద్దరు సెలబ్రిటీల ఇళ్లకు బాంబు బెదిరింపులు… తీరా చూస్తే?
Read also : పల్టీలు కొడుతున్న తమిళనాడు రాజకీయాలు.. తాజా సర్వే వైరల్!