ఎంబీబీఎస్ చదవాలని ప్రతి ఒక్కరికీ కోరిక ఉంటుంది. కానీ అందరికీ ఆ అవకాశం దక్కడం కష్టం. కానీ సిద్ధిపేటలో ఓ కుటుంబానికి చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు ఎంబీబీఎస్ సీట్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. దర్జీగా పనిచేస్తున్న కొంక రామచంద్రం, శారద దంపతులకు నలుగురు కుమార్తెలు. పెద్ద కుమార్తె మమత 2018లో ఎంబిబిఎస్‌లో ప్రవేశం పొంది డాక్టర్ చదువు పూర్తి చేసుకుంది. రెండో కుమార్తె మాధవి 2020లో ఎంబిబిఎస్‌లో అడ్మిషన్ పొందగా..ఈ సంవత్సరం మరో ఇద్దరు కుమార్తెలు రోహిణి, రోషిణి ఎంబిబిఎస్‌లో అడ్మిషన్ పొందారు. ఎంబీబీఎస్ సాధించిన నలుగురు అక్కాచెల్లెళ్లు.. రామచంద్రం దంపతులను మాజీ మంత్రి హరీష్ రావు అభినందించారు. పిల్లల హాస్టల్ ఖర్చుల విషయంలో ఆర్థిక ఇబ్బందులు ఉండటంచో కొంక రామచంద్రం దంపతులకు కొంత ఆర్థిక సాయం అందించారు హరీష్ రావు.
పేద దర్జీ దంపతుల కుమార్తెలు పట్టుదలతో కష్టపడి చదివి తల్లిదండ్రుల కలలను సాకారం చేశారని హరీష్ రావు అభినందించారు. కేసీఆర్ జిల్లాతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణ బిడ్డలు ఇక్కడే ఎంబిబిఎస్ చదవగలుగుతున్నారని చెప్పారు. తెల్ల కోటు’ విప్లవంతో పేద విద్యార్థులు వైద్యవిద్య కలను సాకారం చేసుకుంటున్నారు.. కేవలం 10 వేల రూపాయల ఫీజుతో డాక్టర్ చదువులు చదవగలుగుతున్నారు.. ఇది బిఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ తెచ్చిన అద్భుతమైన మార్పు అని హరీష్ రావు అన్నారు.