
వైద్య వృత్తి చాల పవిత్రమైనది. రోగుల ప్రాణాలు నిలబెట్టే వైద్యుడిని దేవుడిగా భావిస్తుంటారు. అలాంటి పవిత్రమైన వృత్తిలో ఉన్న వ్యక్తి… పైశాచికంగా ప్రవర్తించాడు. తన దగ్గరకు వచ్చే రోగులపై లైంగిక దాడి చేశాడు. మూడు దశాబ్దాల తన కెరియర్‌లో… 300 మందిపై అత్యాచారం చేశారు. ముఖ్యంగా చిన్నారులు వస్తే వదిలిపెట్టే వాడు కాదు. వారికి మత్తుమందు ఇచ్చిన తర్వాత ఇష్టానుసారం అత్యాచారం చేసేవాడు. అంతేకాదు… దాని గురించి ప్రతి విషయం డైరీలో రాసుకునేవాడు. చిన్నారులే కాదు… జంతువులను కూడా అతను వదిలిపెట్టలేదని… అతని డైరీ చదివిన పోలీసులు చెప్తున్నారు. మాజీ సర్జన్ చేసిన నేరాలు-ఘోరాలు బయటపడి.. కేసు కోర్టుకు చేరింది. కోర్టు విచారణలో నేరం అంగీకరించాడు మాజీ సర్జన్ జోయల్.
జోయల్… ఫ్రాన్స్‌లోని బ్రిటానీ వాసి. ప్రస్తుతం ఈయన వయస్సు 74ఏళ్లు. అక్కడే ఓ ఆస్పత్రిలో 30ఏళ్లు సర్జన్‌గా పనిచేశాడు. తన దగ్గరకు వచ్చిన రోగులపై అత్యాచారం చేస్తూ పైశాచికానందం పొందాడు. ఇతని బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. మాజీ సర్జన్ అకృత్యాలు 2017లో బయటపడ్డాయి. అతని పక్కింట్లో ఉన్న ఆరేళ్ల చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు రావడంతో… జోయెల్‌పై కేసు పెట్టారు. ఈ కేసు దర్యాప్తు విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. బ్రిటానీలోని అతని ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు…. 3లక్షలకుపైగా ఫొటోలు చూసి షాకయ్యారు. 700కుపైగా న్యూడ్ వీడియోలను గుర్తించారు.
మాజీ సర్జన్ డైరీ స్వాధీనం చేసుకున్న పోలీసులు… అందులో అతను రాసుకున్నవి చదివి.. అతని మానసికస్థితిని అనుమానం వ్యక్తం చేశారు. చిన్నారులను చూసి ఎక్కువగా ఆకర్షితుడయ్యే వాడు సర్జన్. అది అబ్బాయిలైనా… అమ్మాయిలైనా సరే. వైద్యం కోసం వచ్చిన ఏ ఒక్క చిన్నారిని కూడా వదిలిపెట్టలేదు. సర్జరీ కోసం మత్తుమందు ఇచ్చి… వారు మత్తులో జారుకున్న తర్వాత… వారిపై అత్యాచారం చేశాడు. అంతేకాదు… వారిపై ఎలా లైంగికదాడి చేశాడో డైరీలో రాసుకున్నాడు. చిన్నారులే కాదు… జంతువుల పట్ల కూడా జోయల్ ఆకర్షితుడయ్యేవాడని తెలిసి… పోలీసుల దిమ్మతిరిగిపోయింది. కేసును విచారించిన పోలీసులు… మరో నలుగురు చిన్నారులు కూడా ఇతని బాధితుల జాబితాలో ఉన్నారని తెలిసుకున్నారు. 2020లో జోయెల్‌ను కోర్టు దోషిగా తేల్చి 15ఏళ్లు జైలు శిక్ష విధించింది.
మాజీ సర్జన్ జోయల్ కేసును అక్కడి పోలీసులు వదిలిపెట్టలేదు… మరింత లోతుగా దర్యాప్తు చేశారు. తవ్వే కొద్దీ అతని పాపాల చిట్టా బయటపడుతూనే ఉంది. జోయల్ బాధితుల్లో చాలా మందికి… వారు కూడా బాధితులు అనే విషయం తెలియదు. జోయల్ రాసుకున్న డైరీలో వారి పేర్లు కూడా ఉండటం తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై అంతటి ఘోరం చేశాడా అని విని బాధపడ్డారు.
జోయెల్ కేసులో నిన్న (సోమవారం) అక్కడి కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా మాజీ సర్జన్ జోయల్ నేరం అంగీకరించాడు. దీంతో… అతను చేసిన ఘోరాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. 1989 నుంచి 2014 మధ్య 141 మంది అమ్మాయిలు, 158 మంది అబ్బాయిలపై అతను అత్యాచారం చేసినట్టు కోర్టుకు తెలిపాడు. వీరిలో ఎక్కువ మంది 15ఏళ్ల లోపువారే అని చెప్పాడు. తాను చాలా క్రూరమైన పనులు చేశానని… ఈ గాయాలు మానవని తనకు తెలుసని అన్నాడు. కాలాన్ని వెనక్కి తీసుకెళ్లలేను… కానీ.. తాను చేసిన పనులకు పూర్తి బాధ్యత వహిస్తున్నానని చెప్పాడు. కోర్టు కేసును వాయిదా వేసింది. ఈ కేసులో అతన్ని న్యాయస్థానం దోషిగా తేలిస్తే… మరో 20ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉంటుంది.