తెలంగాణ

మాజీ సర్పంచ్‌లు అరెస్ట్.. రేవంత్‌కు హరీష్ రావు వార్నింగ్

హైదరాబాద్ వస్తున్న సర్పంచులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. జిల్లాల నుంచి వస్తున్న మాజీ సర్పంచ్ లను హైదరాబాద్ శివారులోనే అదుపులోనికి తీసుకుని సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.

తెలంగాణలో మాజీ సర్పంచ్‌లను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి సర్పంచ్ లు పిలుపిచ్చారు. నిరసనలో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్న సర్పంచులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. జిల్లాల నుంచి వస్తున్న మాజీ సర్పంచ్ లను హైదరాబాద్ శివారులోనే అదుపులోనికి తీసుకుని సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. పలుచోట్ల పోలీసులు, మాజీ సర్పంచ్ లకు మధ్య వాగ్వాదాలు సాగుతున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మాజీ సర్పంచ్ ల అరెస్టులను, అక్రమ నిర్బంధాలను తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు.పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ పోరుబాటకు పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్ లను రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం దారుణమన్నారు.ముఖ్యమంత్రి కలిసి వినతిపత్రం ఇవ్వాలని హైదరాబాద్ కు వస్తే వారిని అడ్డుకోవడం, అక్రమంగా నిర్బంధించడం అప్రజాస్వామికం అన్నారు.
అప్పులు తెచ్చి, ఆస్తులు అమ్మి, భార్యా పిల్లల మీద ఉన్న బంగారం కుదువ పెట్టి గ్రామ అభివృద్ధి కోసం చేసిన డబ్బులు ఇవ్వాలంటే ప్రభుత్వం అరెస్టులు చేస్తున్నదని మండిపడ్డారు.

ప్రజాపాలన అంటే ఊరికి సేవ చేసిన సర్పంచులను అరెస్టులు చేయడమేనా? అని హరీష్ రావు ప్రశ్నించారు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ, చిన్న పనులు చేసిన మాజీ సర్పంచులకు మాత్రం బిల్లులు చెల్లించకపోవడంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు. అక్రమంగా నిర్బంధించిన, అరెస్టులు చేసిన మాజీ సర్పంచులు వెంటనే విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులను తక్షణం చెల్లించాలని బి ఆర్ ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీష్ రావు.

రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కేటీఆర్ ట్వీట్ చేశారు.పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఏడాది కాలంగా అడిగినా ఇవ్వకపోవడంసిగ్గుచేటని అన్నారు. రాష్ట్రంలో నిత్యం అరెస్టుల పర్వమే కొనసాగుతోంది- పోలీసులతో సమస్యలను అణగదొక్కాలని చూస్తుంది ప్రభుత్వం..రాష్ట్రంలోని సమస్యలు గాలికి వదిలి ముఖ్యమంత్రి, మంత్రులు ఊరేగుతున్నారు..సర్పంచుల కుంటుంబాలు రోడ్డున పడే దాకా ప్రభుత్వం స్పందించదా.శాంతియుత నిరసనకు పిలుపునిచ్చిన సర్పంచులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అరెస్ట్ చేసిన సర్పంచ్ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button