
క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో : వైసీపీ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్.. సైకిల్ ఎక్కబోతున్నారు. ఫ్యాన్ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆయన… టీడీపీలో చేరేందుకు మొగ్గుచూపారు. కానీ… పరిస్థితి అనుకూలించలేదు. వైసీపీలో మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబుపై, ఆయన తనయుడు లోకేష్‌పై చేసిన విమర్శలు.. టీడీపీలో అవంతి చేరికకు అడ్డుపడ్డాయి. కానీ… విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీ కైవశం కావడంలో.. అవంతి కూతురి పాత్ర కూడా ఉంది. దీంతో…. ఆయనకు టీడీపీ పార్టీ ఆఫీసులో గేట్లు తెరుచుకున్నాయి. తెలుగు దేశం పార్టీలో చేరికకు.. అధిష్టానం అంగీకరించింది. దీంతో.. ఆయన చేరికకు మార్గం సుగమం అయ్యింది.
Also Read : చక్రం తిప్పుతున్న రామ్మోహన్‌నాయుడు – లోకేష్ తర్వాత స్థానం ఆయనదే..!
అయితే… అవంతి చేరికను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యతిరేకిస్తున్నారు. అవంతిని పార్టీలో చేర్చుకుంటే… గంటా, ఆయన వర్గం అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది. దీంతో గంటాను కూడా బుజ్జగించే పనిలో ఉంది అధిష్టానం. అది కూడా దాదాపు సెట్ అయినట్టే అనుకోవచ్చు. త్వరలోనే… అవంతి చేరికకు ముహూర్తం కూడా ఫిక్స్ కానుంది. వైసీపీలో ఉన్నప్పుడు టీడీపీని, జనసేనను విమర్శించిన ఆయన… ఇప్పుడు టీడీపీలోకి వెళ్లాక వైసీపీపై విమర్శలు ఎక్కుపెడతారు. రాజకీయాల్లో ఇది సహజమే. అధికారం కోసం పార్టీ మారడాలు.. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని పొడుగుతూ… ప్రత్యర్థి పార్టీపై విమర్శలు చేయడం సర్వసాధారణమే. అవంతి కూడా అదే బాటలో ఉన్నారు.
Also Read : హైదరాబాద్ ను పాకిస్తాన్ టార్గెట్ చేస్తుందా?.. అంటే అవుననే చెప్పాలి!.. ఎందుకంటే?
అవంతి శ్రీనివాస్ రాజకీయ జీవితాన్ని ఒకసారి పరిశీలిస్తే… 2009లో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ రంగప్రవేశం చేశారు. భీమిలి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనమైన తర్వాత.. కొంత సమయం కొనసాగారు అవంతి. 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి.. అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికలకు ముందు.. వైసీపీలోకి జంప్ అయ్యారు. ఫ్యాన్ గుర్తుపై భీమిలి నుంచి పోటీ చేసి గెలిచారు. అవంతికి మంత్రి పదవి కూడా ఇచ్చారు వైఎస్ జగన్. 2024లో వైసీపీ ఓడిపోవడంతో.. ఇప్పుడు మళ్లీ టీడీపీలోకి వెళ్తున్నారు అవంతి శ్రీనివాస్. రాజకీయం అంటే.. ఇదేనేమో…!