
-
రెండు గ్రామాల మధ్య గొడవపెట్టిన అధికారులు
-
చిచ్చురేపిన భూమి రీలొకేటెడ్ అంశం
-
రెండు గ్రామాల తీవ్ర ఉద్రిక్తత
-
తమకు న్యాయం చేయాలని గోండుగూడ వాసుల డిమాండ్
క్రైమ్ మిర్రర్, నిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రెండు గిరిజన గ్రామాల మధ్య అటవీ అధికారులు చిచ్చుపెట్టారు. ఫారెస్ట్ భూమి రీలొకేటెడ్ అంశం మైసంపేట, గోండుగూడ గ్రామ గిరిజనుల మధ్య చిచ్చురేపింది. సర్వే కోసం వచ్చిన అధికారులను గోండుగూడ వాసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
వివరాల్లోకి వెళ్తే… కడెం మండలం నచ్చన్‌ఎల్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గోండుగూడ శివారులో మైసంపేట గ్రామస్థులకు పునరావాస పథకం కింద పట్టాలు ఇచ్చేందుకు అటవీ అధికారులు ప్రయత్నాలు చేశారు. భూమి సర్వే చేయడానికి వచ్చిన ఫారెస్ట్ అధికారులను గోండుగూడ గిరిజనులు అడ్డుకున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య పోలీసులు, అటవీ అధికారులు సర్వే చేపట్టారు. గిరిజనులు పెద్ద ఎత్తున తరలివచ్చిన అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమ భూములను వేరే గ్రామస్థులకు ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాతముత్తాతల కాలం నుంచి సాగుచేసుకుంటున్నాం: గ్రామస్థులు
గోండుగూడ గ్రామంలో మా తాతముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూమిని ఇప్పుడు వేరే గ్రామస్థులకు ఇవ్వాలని అటవీ అధికారులు చూస్తున్నారని మండిపడ్డారు. ఈ భూమిపై అప్పటి నుంచి తమ పోరాటం సాగుతూనే ఉందని, ఇప్పటివరకు తమకు ఎవరూ న్యాయం చేయలేని విమర్శలు గుప్పించారు. ఇప్పుడు తమ భూమిని వేరే గ్రామస్థులకు ఇచ్చేందుకు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర గ్రామస్థులకు ఇచ్చేందుకు సర్వే చేస్తుంటే అడ్డుకున్నామన్నారు. 30 ఏళ్లుగా పోడు చేసుకుంటున్నామని, అలాంటి భూమిని వేరేవాళ్లకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఎంతమంది అధికారుల చుట్టు తిరిగినా తమకు న్యాయం చేయలేదన్నారు. ప్రాణంపోయినా ఈ భూమిని వదిలిపెట్టేది లేదన్నారు. సచ్చినా, బతికినా ఈ భూమిపైనేనని భీష్మించుకు కూర్చున్నారు.
రాష్ట్రాలతో కాదు.. ప్రపంచం తోనే పోటీపడాలి : సీఎం రేవంత్ రెడ్డి