
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- శ్రీశైలం వెళ్లే భక్తులకు మరియు వాహనదారులకు అటవీశాఖ అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రెండు రోజులలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా చాలామంది భక్తులు శ్రీశైలం తరలివచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే నల్లమల్ల అటవీ శాఖ అధికారులు కొన్ని రూల్స్ పాటించాలని కోరారు. నల్లమల పులుల అభయారణ్యంలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో వాహనదారులు ప్రతి ఒక్కరు కూడా ప్రకృతిని దృష్టిలో ఉంచుకొని నియమాలను పాటించాలని అన్నారు. శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఎవరు కూడా చెత్త పనులు చేయకండి అని అన్నారు. చెత్త లేదా ప్లాస్టిక్ అలాగే ధూమపానం చేసి వాహనం నడపకండి అన్నారు. ఒకవేళ రూల్స్ ను అతిక్రమిస్తే భారీ జరిమానా విధిస్తామని కూడా తెలిపారు.
రంగములోకి దిగిన రాట్ హోల్ మైనర్స్… ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠత?
ఎవరైతే శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రయాణికులను ఇబ్బంది పెడతారో వాళ్లని అరెస్టు చేసి జైలులో ఉంచడం జరుగుతుందని అన్నారు. అంతేకాకుండా చెత్త లేదా ప్లాస్టిక్ రోడ్లపై వేస్తే ₹1000 జరిమానా విధిస్తామని అన్నారు. ఇక ధూమపానం లేదా మద్యపానం సేవిస్తే ₹1000, కోతులకు ఆహారం వేస్తే 1000 రూపాయలు, రోడ్లపై వాహనాలను ఎక్కువసేపు ఆపినా కూడా 500 రూపాయలు, అతివేగంగా వాహనాలు నడిపితే 500 రూపాయల జరిమానా విధిస్తామని స్థానిక గణపతి చెక్ పోస్ట్ వద్ద అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో కచ్చితంగా వాహనదారులందరూ కూడా ఈ రూల్స్ ను పాటించాలని అన్నారు. ఎవరైతే ఈ రూల్స్ అతిక్రమిస్తారో పైన చెప్పిన విధంగా భారీ జరిమానా విధిస్తామని తెలిపారు.
ఘోర రోడ్డు ప్రమాదం…ట్రాక్టర్-బస్సు ఢీకొన్న ఘటనలో మహిళ మృతి
ఇక మరోవైపు శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా ఆలయ అధికారులు తెలియజేశారు. కాగా మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని కొన్ని వేల మంది భక్తులు శ్రీశైలానికి తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రతి ఒక్కరికి మెరుగైన కంటి చూపు వచ్చేంతవరకు ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తా: కోమటిరెడ్డి