
క్రైమ్ మిర్రర్, శ్రీశైలం:- తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న ప్రముఖ శ్రీశైలం జలాశయానికి వస్తున్న వరద ప్రవాహం తగ్గుదల చూపుతోంది. దాంతో అధికారులు డ్యామ్ గేట్లను మూసివేశారు. ప్రస్తుతం జలాశయం వద్ద ఇన్‌ఫ్లో 1,17,480 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 65,851 క్యూసెక్కులుగా నమోదైంది.ప్రస్తుత నీటిమట్టం 882.10 అడుగులుగా ఉండగా, పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. వరద ప్రవాహం క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో జలాశయంలో నీటి నిల్వలు నియంత్రణలోకి వచ్చాయి.
Read also బనకచర్లను వ్యతిరేకిస్తున్నాం – స్పష్టంచేసిన మంత్రి శ్రీధర్‌బాబు
అయితే, వరద ఉధృతి తగ్గినా జల విద్యుత్ ఉత్పత్తి యథావిధిగా కొనసాగుతోంది. డ్యామ్ వద్ద ఉన్న గేట్లు మూసివేసినప్పటికీ, విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నీటిని పంపిణీ చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుండి విడుదలవుతున్న నీరు ఔట్‌ఫ్లోగా కొనసాగుతుంది. పరిస్థితిని అధికార యంత్రాంగం దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. వరద మళ్లీ పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read also : వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి!..ఆస్పత్రి ముందు కుటుంబ సభ్యుల ఆందోళన