
క్రైమ్ మిర్రర్, పులిచింతల:-పులిచింతల ప్రాజెక్టు కు వరద ప్రవాహం కొనసాగుతోంది. భారీగా వచ్చిన వరద నీటిని నియంత్రించేందుకు అధికారులు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో మొత్తం 14 గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌కు వచ్చిన ఇన్‌ఫ్లో 4,13,381 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 4,13,712 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌లో ప్రస్తుత నీటిమట్టం 166.53 అడుగుల వద్ద నిల్వ ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా, వరద ఉధృతి కారణంగా నిల్వలు వేగంగా పెరుగుతున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా వరద ప్రవాహాన్ని సమన్వయం చేస్తూ అధికారులు దిగువకు నీరు విడుదల చేస్తున్నారు.
Read also : కృష్ణా ఉధృతి.. భవానీ ఐలాండ్ చుట్టుముట్టిన వరదనీరు
కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేని సందర్భాల్లో నది పరిసర ప్రాంతాలకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరద ప్రభావం మరికొన్ని రోజులు కొనసాగవచ్చని సూచించారు. పులిచింతల ప్రాజెక్ట్ వరద ఉధృతి కారణంగా కృష్ణానది దిగువ ప్రాంతాల్లో జాగ్రత్తలు తప్పనిసరి అవుతున్నాయి. అధికారులు వరద నీటి పరిస్థితులను నిత్యం పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారు.
Read also : మట్టి విగ్రహాలనే వాడదాం – పర్యావరణాన్ని కాపాడుదాం : కె ఎల్ఆ ర్