
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- ప్రస్తుత రోజుల్లో చాలామంది కూడా పబ్లిక్ వైఫై సేవలు వినియోగించుకుంటూ ఉన్నారు. అయితే ఈ సమయంలో ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని తాజాగా తెలంగాణ రాష్ట్ర పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. పబ్లిక్ వైఫై సేవలు వినియోగించుకుంటూ ఎవరూ కూడా ఆర్థిక లావాదేవీలు చేయవద్దు అని సూచనలు చేశారు. ఎందుకంటే పబ్లిక్ వైఫై సేవలు ద్వారా ఎవరికైనా సరే లావాదేవీలు పంపించినప్పుడు.. మీ వ్యక్తిగత బయోడేటా సైబర్ నేరగాళ్ళకు చిక్కెటువంటి అవకాశం ఉంటుంది అని.. ఒక్కసారి మోసగాళ్లకు పడ్డారంటే కచ్చితంగా నష్టం జరుగుతుంది అని వెల్లడించారు. తద్వారా ఎవరైనా సరే అత్యవసరమైతే తప్ప వైఫై అనేది వాడకండి. అత్యవసరమైన సందర్భాల్లోనే ఇతరుల వైఫై ఉపయోగించండి అని పోలీసులు సూచించారు. ఇక తెలియనటువంటి వెబ్సైట్స్ కు సంబంధించి పాప్ అప్ ను పట్టించుకోకూడదు అని తెలియజేశారు. ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరాలు వివిధ రకాలుగా మోసాలు చేస్తున్న సందర్భంలో ప్రజలు కూడా వారి వలలో సులభంగా చిక్కుతున్న కారణంగా పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఎవరైనా సరే మీ బంధువులు లేదా మీరే సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నెంబర్ కు ఫిర్యాదు చేయాలి అని పిలుపునిచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇటువంటి తరుణంలో అపర్ మొత్తం గా లేకపోతే చాలా సులభంగా సైబర్ నెరగాళ్లు మీ వ్యక్తిగత డేటాను అలాగే డబ్బులను దోచేసుకుంటారు. తాజాగా పబ్లిక్ వైఫై ద్వారా కూడా మోసాలు జరుగుతున్నట్లుగా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఇటువంటి సూచనలు చేశారు.
Read also : కుప్పలు కుప్పలుగా ఎయిర్పోర్టులో సూట్ కేసులు.. తలలు బాదుకుంటున్న ప్రయాణికులు!
Read also : Emotional Trap: ‘పెళ్లి చేసుకుంటాం’ అని 51 ఏళ్ల బ్రహ్మచారిని నమ్మించిన 21, 19 ఏళ్ల యువతులు.. ఆపై..





