
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 8 మరియు 9వ తేదీలలో ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ జరగనున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్లోబల్ సమ్మిట్ ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని వ్యవహరిస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ అలాగే వివిధ మంత్రులు కలిసి హెలికాప్టర్లో ఫ్యూచర్ సిటీలో జరగబోయేటువంటి గ్లోబల్ సమ్మిట్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఇక తాజాగా ఇండిగో విమానాలు రద్దయిన సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ సదస్సుకు వచ్చేటువంటి ప్రముఖులు మరియు అతిధులకు ప్రత్యేకమైన విమానాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఒకవైపు ఇండిగో విమానాలు రద్దు అయిన నేపథ్యంలో.. సదస్సుకు వచ్చేటువంటి అతిధుల విషయంలో ఎటువంటి లోటుపాట్లు జరగకుండా ముందుగానే ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. సబ్మిట్ కు వచ్చేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇబ్బందులు పడకుండా ఉండేందుకే వారి కోసం ప్రత్యేకమైనటువంటి విమానాలను ఏర్పాటు చేస్తున్నట్లుగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం ఎంతోమంది ప్రముఖులకు ఈ ఫ్యూచర్ సిటీలో జరగబోయేటువంటి గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానాలు అందజేశారు.
Read also : 2050 నాటికి కొన్ని కోట్ల మందికి నీటి తిప్పలు..!
Read also : దేవుడంటే భక్తి లేదు,ఆలయాలంటే లెక్కలేదు : సీఎం చంద్రబాబు





