ఆంధ్ర ప్రదేశ్రాజకీయం

ఆంధ్రాలో ఫ్లెక్సీ వైరల్… ఇరు పార్టీల మధ్య వైరం ముదిరేనా?

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం మెడికల్ కాలేజీల భవనాల సందర్శనకు వస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఇందులో భాగంగానే మార్గమధ్యంలో ఒక ఫ్లెక్సీ కలకలం రేపింది. ఈ ఫ్లెక్సీ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆగి మరి ఫోటోలు తీయడం మొదలుపెట్టారు. ఇంతకు ఆ ఫ్లెక్సీలో ఏముంది అంటే… “YCP NEVER AGAIN” అని రాసి ఉంది. అంతేకాకుండా మాస్క్ ఇవ్వలేక హత్యలు చేసే వాళ్ళు… మెడికల్ కాలేజీ ల గురించి మాట్లాడడమా?.. ‘ప్రజలు తస్మాత్ జాగ్రత్త’.. అని ఆ ఫ్లెక్సీలో రాసి ఉంది. అంతేకాకుండా ఫ్లెక్సీ మధ్యలో డాక్టర్ సుధాకర్ ఫోటోను వేయడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే గత వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కరోనా సమయంలో మాస్కులు అడుగుతూ నిరసన తెలిపారు ఈ డాక్టర్ సుధాకర్.

ఈ డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తిపై అప్పటి వైసీపీ ప్రభుత్వం వేటు వేయగా కొద్ది రోజులకే అతను మరణించడం జరిగింది. ఈ విషయం గత ప్రభుత్వంలో సంచలనం సృష్టించిన విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. అయితే ఇన్నాళ్లకు మళ్లీ ఈ బ్యానర్ లో అతని ఫోటోను ముద్రించడం.. వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఈ బ్యానర్ ఉండడంతో క్షణాల్లోనే వైరల్ అయింది. చాలామంది ఈ ఫ్లెక్సీలు చూసి మళ్ళీ రాజకీయంగా ఎన్ని వైరాలు చూడాల్సి వస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. జగన్మోహన్ రెడ్డి నేడు పర్యటనలో భాగంగా ఇటువైపు నుంచి వెళ్లాల్సి ఉంటుంది.. కావాలనే కూటమి ప్రభుత్వ నాయకులు ఈ బ్యానర్ అంటించి.. మళ్లీ గొడవలు సృష్టించాలని అనుకుంటున్నారు అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Read also : ఇంకోసారి మీటింగ్ పెడితే బాంబు పెడతా అంటూ విజయ్ కు బెదిరింపులు?

Read also : కబడ్డీలో తెలుగు జట్టు దూసుకుపోతుంది… వరుసగా 5 విజయాలతో రికార్డు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button