ఆంధ్ర ప్రదేశ్క్రైమ్జాతీయంతెలంగాణసినిమా

ఐదుగురు నన్ను లైంగికంగా వేధించారు- కన్నీరుపెట్టుకున్న వరలక్ష్మీ శరత్‌కుమార్‌

ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. కానీ... స్టార్‌ హీరోయిన్‌ హోదా మాత్రం రాలేదు.

వరలక్ష్మీ శరత్‌కుమార్‌… నటిగా మంచిపేరు తెచ్చుకున్నారు. తమిళ, తెలుగు, కన్నడ, మళయాల చిత్రాల్లో నటించారు. హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. విలక్షణ నటిగా పేరుతెచ్చుకున్నారు. ఈమె శరత్‌కుమార్‌ వారసురాలు. అయినా.. తండ్రి సపోర్ట్‌ లేకుండానే దక్షిణాదిలో నటిగా ఎదిగారు. పోడాపోడి అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. కానీ.. ఆ సినిమా అంతగా హిట్‌ కాలేదు. పోడాపోడి సినిమాకు.. నయనతార భర్త విఘ్నేష్‌ దర్శకత్వం వహించగా.. శింబు హీరో. ఆ తర్వాత… తారైతప్పట్టై సినిమాలో వరలక్ష్మీ నటించారు. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. కానీ… స్టార్‌ హీరోయిన్‌ హోదా మాత్రం రాలేదు. హీరోయిన్‌గానే కాకుండా.. విలన్‌ పాత్రలు కూడా చేసి మెప్పించారు వరలక్ష్మి. లేడీ ఓరియెంట్‌ పాత్రలు కూడా చేశారు. ఇలా… విలక్షణ నటిగా పేరు తెచ్చుకున్నారు. తమిళ్‌, తెలుగు, కన్నడ, మళయాలం సినిమా నటించింది… దక్షిణాది నటిగా గుర్తింపుపొందారు. గత ఏడాది హనుమాన్‌ సినిమాలో నటించి మెప్పించారు. ఇప్పుడు.. లేడి ఓరియెంటెండ్‌ మూవీ అయిన శివంగిలో నటిస్తున్నారు. అలాగే… విజయ్‌ దళపతి ‘నాయగన్‌’ మూవీలో కీ రోల్‌ చేస్తున్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్‌.

వరుస సినిమాలు చేస్తూనే… టీవీషోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు వరలక్ష్మి శరత్‌కుమార్‌. ఇటీవల… ఓ తమిళ టీవీషోకు వెళ్లిన ఆమె.. బాల్యంలో తనకు ఎదురైన చేదుఅనుభవాలను గుర్తుచేసుకుని ఎమోషన్‌ అయ్యారు. స్టేజ్‌పైనే కన్నీరు పెట్టుకున్నారు. అసలు ఏంజరిగిందంటే… టీవీషోలో భాగంగా ఒక లేడీ కంటెస్టెంట్‌ తన జీవితంలో ఎదురైన వేధింపుల గురించి చెప్పుకుని ఏడ్చేశారు. అది చూసిన వరలక్ష్మి కూడా ఎమోషనల్‌ అయ్యారు. తనకూ చిన్నతంలో అలాగే జరిగిందని… లైంగిక వేధింపులకు గురయ్యానని చెప్పి బాధపడ్డారు. చిన్నతనంలో ఐదారుగురు తనను లైంగికంగా వేధించారని కన్నీరు పెట్టుకున్నారు. ఇద్దరిదీ ఒకటే కథ అని ఆ కంటెస్టెంట్‌కు చెప్పి ఎమోషనల్‌ అయ్యారామె. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇప్పుడే కాదు.. ఇదివరకు కూడా బాల్యంలో తాను పడిన కష్టాలను బుల్లితెర వేదికగా పంచుకున్నారు వరలక్ష్మి. ఇటీవల ఒక డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న ఆమె… 2వేల 500 కోసం రోడ్‌పై డ్యాన్స్‌ చేయాల్సి వచ్చిందన్నారు. ఆ డాన్స్‌ కార్యక్రమంలో ముగ్గురు బిడ్డల తల్లి పాల్గొంది. తనదైన స్టెప్పులతో అదరగొట్టింది. ఆమె టాలెంట్‌ను మెచ్చుకుంది వరలక్ష్మి. ఈక్రమంలో… గతంలో రోడ్డుపై డాన్స్‌ చేసిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు వరలక్ష్మి. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టకముందు… ఒక షో కోసం రోడ్డు మీద డ్యాన్స్‌ చేశారని చెప్పారు. అప్పుడు తనకు 2వేల 500 రూపాయలు వచ్చాయని చెప్పారామె.

ఇవి కూడా చదవండి …

  1. జగన్‌కు ఏడుగురు ఎమ్మెల్యేల వెన్నుపోటు – రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారుగా…!

  2. హయత్ నగర్ లో రోడ్డు ప్రమాదం.. అడిషనల్ ఎస్పీ దుర్మరణం 

  3. కాలం తెచ్చిన కరువు కాదు… పక్కా కాంగ్రెస్ తెచ్చిన కరువే.

  4. టీడీపీని తొక్కుకుంటూ పైకొస్తున్న జనసేన – తిరుపతి చంద్రబాబు పర్యటనే సాక్ష్యం

  5. తిరుమల దర్శనాల కోసం అడుక్కోవాల్సిన ఖర్మేంటి..? – టీటీడీపై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button