
నాగర్ కర్నూల్, క్రైమ్ మిర్రర్ న్యూస్:-
నాగర్ కర్నూల్ జిల్లాకలెక్టరేట్ ఎదుట మత్స్యకారులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. మత్స్యకార శాఖలో అవినీతి జరుగుతోందని ధర్నాలు చేస్తూ ఆరోపించారు. మత్స్యకార శాఖ ఏడి రజిని ని వెంటనే సస్పెండ్ చేయాలని మత్స్యకారులు అందరూ డిమాండ్ చేశారు.కొత్త సంఘాలను రిజిస్టర్ చేయడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, సంఘాల్లో కొత్త సభ్యులను చేర్చుకునేందుకు కూడా లంచం అడుగుతోందని వారు ఆరోపించారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మత్స్యకారుడు మృతి చెందిన సందర్భంలో ఎక్స్గ్రేషియా కోసం కూడా డబ్బులు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, ఇతర చెరువులను సంఘాలు లీజుకు తీసుకునే సమయంలో వాటా ఇవ్వాలని AE రజిని డిమాండ్ చేస్తోందని మత్స్యకారులు ఆరోపించారు.ప్లేకార్డులతో ర్యాలీగా వచ్చి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అధికారుల నుండి తక్షణ చర్యలు తీసుకోవాలని, రజినిని సస్పెండ్ చేయాలని స్పష్టంగా డిమాండ్ చేశారు.