
క్రైమ్ మిర్రర్, మిర్యాలగూడ:- నల్గొండ జిల్లా,మిర్యాలగూడ పట్టణంలోని బాపూజీ నగర్‌లో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. టపాకాయల తయారీలో ఉపయోగించే పేపర్ రోల్స్ పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే గోదామంతా దట్టమైన పొగలతో నిండిపోయింది.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా స్పందించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో పేపర్ రోల్స్ తయారీకి ఉపయోగించే యంత్రాలు, ఇతర సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. గోదాం వద్ద నిలిపి ఉంచిన ఒక బైకు కూడా మంటల్లో కాలిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.ప్రమాదం అదుపులోకి రావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు.
Read also : మాస్ 2026 తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవంతం..!
Read also : బ్యాంకుల సమ్మె: వరుసగా 3 రోజులు బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం





