
క్రైమ్ మిర్రర్, తుర్కయంజాల్ : ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్ లో ఇటీవల ఆకస్మికంగా చనిపోయిన కోడూరు భాష కుటుంబానికి చిన్ననాటి మిత్రులు అండగా నిలిచారు. యాచారం మండలం చిన్నతూండ్ల జిల్లా పరిషత్ స్కూల్ లో 2000-2001లో టెన్త్ చదివిన తోటి స్నేహితులు భాష భార్య అనితకు రూ.55వేలు అందజేసి ఆ కుటుంబానికి చేయూతనందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తమతో కలిసి ఇన్నాళ్లు ఉన్న భాష ఇప్పుడు తమతో లేకపోవడం బాధాకరం అన్నారు. భాష కుటుంబాన్ని ఆదుకోవడం తమ బాధ్యత అని అన్నారు.
రానున్న కాలంలో ఆయన కుటుంబానికి, పిల్లల భవిష్యత్తు కోసం తోడ్పాటు నందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెండ్యాల భాస్కర్ చారి, ఈసరి మహేందర్, గడ్డం నర్సింహ రెడ్డి, సామర్తి జగన్, అందే అమరేందర్ అనుమాండ్ల జగన్, ఎన్.రాజు, శ్యామల గణేష్, యెర్నాగి రాజు, బి. కృష్ణంరాజు, కటికపల్లి రాజు, కంకర్ల గణేష్, జక్కుల వెంకటేష్, పూజారి యాదగిరి, చేగూరి అశోక్, అంతారం ప్రభాకర్ రెడ్డి, అర్థం స్వప్న, కొంపోజు పాండు, సామర్తి యాదగిరి, పోలిశెట్టి నరేష్, దొడ్డి రమేష్, బోడ రమేష్, కె. రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.