
బీసీ రిజర్వేషన్ల సాధనే సాయి ఈశ్వరాచారికి నిజమైన నివాళి
మునుగోడు, క్రైమ్ మిర్రర్:- 42% బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మత్యాగం చేసుకున్న సాయి ఈశ్వరాచారి కుటుంబ సభ్యులను జగద్గిరిగుట్ట లోని వారి నివాసంలో కలిసి విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ పక్షాన సేకరించిన 65 వేల రూపాయల విరాళాలను విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ యువజన విభాగం జాతీయ అధ్యక్షులు కూరెళ్ళ శివరామ్ ఆచార్య కమిటీ సభ్యులతో కలిసి అందజేశారు. రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసంతో కలత చెంది తన ఆత్మత్యాగంతనైనా బీసీలు రాజకీయ, విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను సాధించుకోవాలని, తన ప్రాణాన్ని తృణప్రాయంగా అగ్నికి ఆహుతి చేసిన సాయి ఈశ్వరాచారి త్యాగం వెలకట్టలేనిదని కూరెళ్ళ శివరామ్ ఆచార్య అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రవీణ్ చారి,త్రినాష్ చారి, ఈశ్వరా చారి, నాగేంద్ర చారి, నరేష్ చారి పాల్గొన్నారు.
Read also : మాట తప్పని భారత్ అన్న సైన్యం యువకులు.. కురిసిన ప్రశంసల జల్లు
Read also : రాత్రిపూట ట్రైన్‌లో ప్రయాణిస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి





