
-
మామిడి రైతులను కూటమి సర్కార్ ఆదుకోవాలి
-
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో తీవ్ర ఉద్రిక్తత
-
జగన్ కాన్వాయ్ పైనుంచి పడిపోయిన వైసీపీ నేత
క్రైమ్ మిర్రర్, అమరావతి: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో వైసీపీ అధినేత జగన్ పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. అరగొండ ఫ్లై ఓవర్ దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. హెలిప్యాడ్ నుంచి మార్కెట్‌కు ర్యాలీగా వెళ్లేందుకు వైసీపీ శ్రేణులు యత్నించాయి. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. ఈ క్రమంలో జగన్ కాన్వాయ్‌పైనుంచి వైసీపీ నేత విజయానందరెడ్డి పడిపోయారు.
మామిడి రైతులతో జగన్ మాటామంతి
బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో మామిడి రైతులతో జగన్‌తో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిట్టుబాటు ధర లేక నష్టాల్లో కూరుకుపోయామని రైతులు వాపోయారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులతో మాట్లాడనీయకుండా చేయాలని కూటమి సర్కార్ కుట్ర పన్నిందని ఆరోపించారు. కేవలం 500మందితో మాట్లాడేందుకే పోలీసులు అనుమతించారని, ఈ ఆంక్షలు ఎందుకని జగన్ ప్రశ్నించారు.
హీటెక్కిస్తున్న నెల్లూరు జిల్లా రాజకీయాలు… కోవూరులో నల్లపురెడ్డి వర్సెస్ వేమిరెడ్డి
మే నెలలో చేపట్టాల్సిన మామిడి కొనుగోళ్లను ఎందుకు చేపట్టలేదని ప్రభుత్వాన్ని జగన్ నిలదీశారు. జూన్ తర్వాత కొనుగోళ్లు ప్రారంభించడంతో మార్కెట్‌ను మామిడి కాయలు పేరుకుపోయాయని, దీంతో కంపెనీలు ధర తగ్గించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతుల పక్షాన పోరాడతామని జగన్ హెచ్చరించారు.