
క్రైమ్ మిర్రర్, పెబ్బేరు:- కార్తీక మాసం సందర్భంగా ఆలయాలు ఆధ్యాత్మికతను సంతరించుకున్నాయి. ముఖ్యంగా శివాలయాల్లో భక్తులు రోజూ అధిక సంఖ్యలో వెళ్లి తెల్లవారుజామునే తొలి దీపం పెడుతూ కాంతులు వెదజల్లుతున్నారు. కొన్ని ఆలయాల్లో తులసీ, ఉసిరి వృక్షాలకు, రావి, వేప చెట్లకు కల్యాణం జరిపిస్తున్నారు. కార్తీకమాసంలో చెట్లకు పెళ్లిల్లు చేస్తే ఇంట్లో సిరిసంపదలు నెలవవుతాయని నానుడి. అందులో భాగంగానే సోమవారం పెబ్బేరు పట్టణంలోని శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో పట్టణ అధ్యక్షుడు దేవరశెట్టి మహేష్, మహిళా, యువజన సంఘాల ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. సోమవారం సాయంత్రం మహిళలు, పురుషులు పెద్ద ఎత్తున పాల్గొని కార్తీక దీపాన్ని వెలిగించారు. అనంతరం కమిటీ సభ్యులు శివ, పార్వతుల ఉత్సవ విగ్రహాలతో ఆలయం చుట్టూ పల్లకీసేవ నిర్వహించారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు దాతలు దేవరశెట్టి బాలరాజు, కవిత దంపతులు అల్పాహారాన్ని వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.
Read also : ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించే వరకు కాలేజీల నిరవధిక బంద్
Read also : తెల్లవారుజామున భూప్రకంపనలు.. భయపడిపోయిన వైజాగ్
				
					
						




