•జడ్పిహెచ్ఎస్ మునుగోడు 2004-05 బ్యాచ్
మునుగోడు, క్రైమ్ మిర్రర్:- మునుగోడు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 2004 – 2005 బ్యాచ్ విద్యార్దులు తోటి విద్యార్ది ప్రశాంత్ జ్ఞాపకార్థం పాఠశాల విద్యార్ధుల అవసరాల కోసం పాఠశాలకు 3 బీరువాలు విరాళంగా అందజేశారు. ప్రధానోపాధ్యాయులు బాల ప్రసాద్ విద్యార్ధుల సేవబావాన్నీ అభినందించారు. పాఠశాల ఉపాధ్యాయులు కే సత్తిరెడ్డి , కే రత్నయ్య తోపాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొని ప్రశంసించారు. బ్యాచ్ సభ్యులు మాట్లాడుతూ ప్రశాంత్ మా మిత్రుడు ఎప్పుడూ సహాయం చేయాలనే మనసున్న వ్యక్తి అన్నారు. అతని జ్ఞాపకాలు గుర్తుకు ఉండేలా పాఠశాలకు బీరువాలు విరాళంగా అందజేషామన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్దులు 2004 – 05 బ్యాచ్ విద్యార్దులకు కృతజ్ఞతలు తెలిపారు.
Relationships: అబ్బాయిలకు అమ్మాయిలో నచ్చేది ఇదే!
