క్రైమ్

Viral News: బిడ్డ బతికి ఉండగానే అంత్యక్రియలు.. కారణం ఏంటంటే?

ఓ తండ్రి తన కూతురు బతికి ఉండగానే అంత్యక్రియలు చేశాడు. ఆమెకు శ్మశానంలో సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాడు. ఎందుకంటే..

Madhya Pradesh Viral News: మధ్యప్రదేశ్‌ లోని విదిషలో షాకింగ్ ఘటన జరగింది.  ఓ తండ్రి తన 23 ఏళ్ల కుతురుకి వారి ఆచార పద్దతిలో అంత్యక్రియలు నిర్వహించాడు. పిండితో ఆమె బొమ్మను తయారు చేసి దానికి కర్మలు చేశాడు. ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఆయన కూతురు బతికే ఉంది. గ్రామంలో ఈ విషయం తెలిసి అందరూ భావోద్వేగానికి గురయ్యారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

ఆయన కూతురు సవితా కుష్వాహ కొన్ని రోజుల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితులు ఇలా అందరినీ వాకబు చేశారు. చివరికి ఆమె ఒక యువకుడితో వెళ్లిపోయినట్లు తెలుసుకున్నారు. దాంతో సవితకు కుటుంబం సభ్యులు షాకయ్యారు. అల్లారు ముద్దుగా పెంచిన కూతురు తమను కాదని వేరే యువకుడితో వెళ్లిపోవడాన్ని తట్టుకోలేకపోయారు. కూతురు చేసిన పనికి గ్రామంలో తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. తమ కూతురు చనిపోయిందని భావించారు. ఆమెకు తమ ఆచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.

కూతురుకు సంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు

ఈ నేపథ్యంలో పిండితో సవిత ప్రతిమను తయారు చేశారు. దాన్ని పాడెపై మోసుకుంటూ గ్రామంలో ఊరేగించారు. శ్మశానవాటికకు వెళ్లి ఆ బొమ్మకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు కూడా వచ్చారు. ఈ విషయం గురించి సవిత తండ్రి మాట్లాడుతూ..”నా కూతురుని ఎంతో ప్రేమతో చూసుకున్నాం. ఆమె అడిగిన ప్రతి ఒక్కటీ ఇప్పించాం. నా కూతురు చేసిన పనికి మేం అవమానంతో కుంగిపోయాం..నా జీవితంలో అత్యంత విషాదకరమైన క్షణం. ఆమె మా దృష్టిలో చనిపోయింది.. అందుకే అంత్యక్రియలు చేశాం” అని అన్నాడు. ప్రస్తుతం ఈ ఘటన మధ్య ప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. అందరూ అయ్యోపాపం అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button