
క్రైమ్ మిర్రర్, చేవెళ్ల:- రంగారెడ్డి జిల్లా,చేవెళ్ల మండలం, మీర్జాగూడ వద్ద తీవ్రమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, బస్సులో ప్రయాణిస్తున్న పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం ప్రకారం ప్రమాద సమయంలో బస్సులో 70 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఢీకొన్న ప్రభావంతో టిప్పర్‌లో ఉన్న కంకర బస్సులోకి దూసుకెళ్లి ప్రయాణికులపై పడింది. కంకర కింద కొంతమంది ఇరుక్కుపోయిన పరిస్థితి ఏర్పడటంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Read also : బాన్సువాడలో విషాద ఘటన… అత్తతో గొడవ.. కోడలు ఆత్మహత్య!
అత్యవసరంగా స్పందించిన పోలీసులు, స్థానికులతో కలిసి క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల ఖచ్చిత కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ రూట్‌లో ఇలాంటి భారీ వాహనాలు తరచూ తిరుగుతూ ఉండటంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు భద్రతపై సంబంధిత అధికారులకు పునరాలోచన అవసరం ఉందని స్థానికులు భావిస్తున్నారు.
Read also : నవంబర్ 5న కార్తీక పౌర్ణమి.. 10 లక్షల దీపాలతో కాశి వెలుగులు!





