బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్
క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా నిధులు నేటికి అందకపోవడంతో రైతాంగం తీవ్ర ఆవేదనతో ఉన్నారని బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన బీసీ యువజన సంఘం రాష్ట్ర సమావేశంలో ఆయన మాట్లాడుతూ…
పంట పెట్టుబడికి ముందుగా అందించాల్సినటువంటి రైతు భరోసా నిధులు పంట కోత దశకు వచ్చిన కూడా ప్రభుత్వం నేటికీ రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో వేయకపోవడం బాధాకరం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ రైతులతో చెలగాటం ఆడుతుంది మండిపడ్డారు.
పెట్టుబడి సాయంగా కింద ప్రభుత్వం నేటి వరకు అందకపోవడంతో రైతులు అప్పులు చేస్తున్న సందర్భం తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తోంది అన్నారు. రైతులను చిన్నచూపు చూస్తున్నటువంటి ఈ ప్రభుత్వంకి రైతులు త్వరలోనే మంచి గుణపాఠం చెప్తారని అన్నారు.
ఒకవైపు రైతు భరోసా నిధులు అందకపోవడం మరోవైపు పంటకు కావాల్సిన ఎరువులు అందించక పోవడంతో రైతాంగం ప్రభుత్వంపై తీవ్ర వెతిరేకంగా ఉంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు ఇచ్చేటువంటి రైతు భరోసా నిధులు తక్షణమే విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఆలాగే రైతులకు పంట రుణమాఫీ చేశాం అని చుప్పుకుంటున్నరు తప్ప, ఇప్పటి వరకు కూడా పంట రుణమాఫీ 20 వేల వరకు కూడా మాఫీ కాలేదని అన్నారు. కాంగ్రెస్ నాయకులు మాత్రం మా ప్రభుత్వం రుణమాఫీ పూర్తిగా చేసింది అని గొప్పలు చెప్పుకోవడమే తప్ప రైతులను అడిగితే తెలుస్తుంది ఎంతవరకు పంట రుణమాఫీ జరిగిందో అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో నీల వెంకటేష్, రాజేందర్, అనంతయ్య, సతీష్, రవీందర్, సావిత్రి, నిర్మల తదితరులు పాల్గొన్నారు..
