
మునుగోడు, క్రైమ్ మిర్రర్: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, అధీకృత డీలర్ల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని ఏఈవో మాధగోని నరసింహ గౌడ్ సూచించారు. మునుగోడు మండలంలోని కలవలపల్లి గ్రామంలో పంట మార్పిడిపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
పంట మార్పిడితో భూమి సారవంతత పెరగడమే కాక, పెట్టుబడి ఖర్చు గణనీయంగా తగ్గుతుందని నరసింహ గౌడ్ తెలిపారు. విత్తనాలు కొనుగోలు చేసే ఫార్మర్స్ ముందుగా వాటి ప్రమాణాలు, అధికారికతను ధృవీకరించుకోవాలని, తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని సూచించారు.
ఇక రత్తిపల్లి గ్రామంలో ఏఈఓ నిఖిల్ ఆధ్వర్యంలో మరో అవగాహన కార్యక్రమం జరిగింది. మాజీ సర్పంచ్ మాధగోని రాజేష్ గౌడ్ పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. దళారుల చేతిలో మోసపోకుండా, ప్రభుత్వానికి అనుమతిచ్చిన డీలర్ల నుంచే పత్తి విక్రయాలు చేయాలని సూచించారు. ఈ సమావేశాల్లో పలువురు రైతులు, గ్రామస్తులు పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల చర్యలను రైతులు అభినందించారు.