Friday, March 20, 2026
Homeతెలంగాణవేలాడుతున్న వైర్లతో భయభ్రాంతులకు గురవుతున్న రైతన్నలు.. పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు!

వేలాడుతున్న వైర్లతో భయభ్రాంతులకు గురవుతున్న రైతన్నలు.. పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు!

క్రైమ్ మిర్రర్, వలిగొండ :- యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండల పరిధిలోని అరుర్ గ్రామపంచాయతీ పరిధిలోని మోర్సుబావి దగ్గర వేలాడుతున్న విద్యుత్ వైర్లతో పొంచి ఉన్న ప్రమాదం. పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు. ఎన్నిసార్లు మొర పెట్టుకున్న పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి అని రైతులు కోరుతున్నారు. DE కి AE కి ఎన్ని సార్లు మొర పెట్టుకున్న స్పందించని అధికార యంత్రాంగం. రైతులు పొలం దున్నాలన్న, వరి చేను కోసుకోవాలన్న వేలాడుతున్న విద్యుత్ వైర్లతో భయభ్రాంతులకు గురవుతున్నారు. తక్షణమే పై అధికారులు స్పందించి ఈ యొక్క వైర్లను తొలగించి రైతులను ప్రమాదం నుండి కాపాడాలని.. పరిసర ప్రాంత పొలం రైతులు కోరుతున్నారు.

Read also : భార్య కోసం తల్లిదండ్రులను ముక్కలుగా నరికి చంపాడు

Read also : తెలంగాణ పోలీస్ విభాగంలో 325 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments