
క్రైమ్ మిర్రర్, వలిగొండ:- యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండల పరిధిలోని గోపరాజు పల్లి గ్రామంలో రాత్రి రెండు గంటల 30 నిమిషాల నుండి భారీ వర్షం కురవడంతో రైతులు మార్కెట్లో పోసిన ధాన్యం పూర్తిగా జలమలయం అయ్యింది. తెల్లవారుజామున రైతన్నలు మార్కెట్లకు వచ్చి చూడడంతో ధాన్యం తడిసి ముద్దవ్వడం చూసి దిగులు చెందారు. ఆరుగాలం చేసి పండించిన పంట అకాల వర్షంతో తడిసి ముద్ద అవ్వడంతో రైతన్నలు లబోదిబోమంటూ కన్నీరు పెట్టడం జరిగింది. విలేకరులు మార్కెట్ కు వెళ్లగా వారి గోసను కన్నీరు పెడుతూ ఏడ్చారు. వెంటనే సమాచారాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం అధికారులు వెంటనే సందర్శించి రైతన్నలను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
Read also : లేచిన వెంటనే అలసట, కంటి చూపు మందగించినట్లు అనిపిస్తుందా?.. అయితే ప్రమాదమే!
Read also : తెలుగు రాష్ట్రాల్లో భీకర వర్షాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు