Homeక్రీడలుఓటమితో నిరాశలో ఉన్న ఫ్యాన్స్.. హార్దిక్ మాత్రం జల్సాలంటూ ఆగ్రహం?

ఓటమితో నిరాశలో ఉన్న ఫ్యాన్స్.. హార్దిక్ మాత్రం జల్సాలంటూ ఆగ్రహం?

క్రైమ్ మిర్రర్,స్పోర్ట్స్ న్యూస్:-  T20 వరల్డ్ కప్ లో భాగంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టు సూపర్-8 లో మొట్టమొదటి మ్యాచ్ లోనే ఘోరపరాజయం పొందింది. సౌత్ ఆఫ్రికా లో జరిగిన మ్యాచ్లో ఏకంగా 76 పరుగులు తేడాతో భారత్ ఘోర ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ ఓడిపోయిన అనంతరం ఫ్యాన్స్ అందరూ తీవ్ర నిరాశలో ఉంటే హార్దిక్ పాండ్యా మాత్రం తన గర్ల్ ఫ్రెండ్ మహిక శర్మతో జల్సాలు చేస్తున్నారు అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా విపరీతంగా మండిపడుతున్నారు. గర్ల్ ఫ్రెండ్ మీద ఉన్న శ్రద్ధ ఆటపై పెడితే బాగుంటుంది అని హార్థిక్ పాండ్యా పై సాటిర్లు వేస్తున్నారు. జట్టులోని ఆటగాళ్లు బాధ్యత లేకుండా వ్యవహరించడం వల్లనే జట్టు ఓడిపోతుంది అంటూ విమర్శలు చేస్తున్నారు.

ఈమధ్య కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా తన భార్యతో కలిసి పలుచోట్ల తిరగడం.. అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారడం ఫాన్స్ ను తీవ్ర అసహనానికి గురిచేస్తున్నాయి. భారత జట్టు ఈసారి కూడా టి20 వరల్డ్ కప్ గెలవాలి అని కొన్ని కోట్ల మంది కలలు కంటున్నారు. ఆ కలలను నిజం చేయాలి అంటే జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు కూడా ఆటపై శ్రద్ధ పెట్టడం అవసరమని అంటున్నారు. గర్ల్ ఫ్రెండ్స్, భార్యలతో షికారులకు ప్రత్యేక సమయం అనేది ఒకటి ఉంటుంది అని ఫ్యాన్స్ అందరూ ఆటగాళ్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా ఈ టి20 వరల్డ్ కప్పులో భారత్ సెమిస్ కి చేరాలి అంటే నెక్స్ట్ జరగబోయేటువంటి రెండు మ్యాచ్లలోనూ ఘన విజయాన్ని సాధించడమే కాకుండా నెట్ రన్ రేట్ కూడా హైలో ఉంచుకోవాలి.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు