
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:-బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర గత కొద్దిరోజులు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం డిశ్చార్జ్ అయిన విషయం ప్రతి ఒకరికి తెలిసిందే. అయితే తాజాగా ధర్మేంద్ర కన్నుమూశారు అని జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. గతంలో కూడా సోషల్ మీడియా వేదికగా అతను చనిపోయారు అని ఫేక్ వార్తలు రాగా అవి అన్ని అబద్ధం అంటూ తన కూతురు మీడియా వేదికగా తెలిపారు. ఇక అదే అనారోగ్య సమస్యతో తాజాగా అతను మృతి చెందినట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో బాలీవుడ్ ప్రముఖ నటులు, ప్రముఖ రాజకీయ నేతలు కూడా అతని భౌతికకాయానికి నివాళులర్పించేందుకు చింతమయ్యారు. ఇప్పటికే అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి పలువురు నటులు అతని ఇంటికి చేరుకున్నట్లుగా సమాచారం. దాదాపు 300కు పైగా చిత్రాల్లో ఈ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర నటించారు. 1997 వ సంవత్సరంలో ఫిలిమ్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న ఇతను 2012వ సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు కూడా అందుకున్నారు. బాలీవుడ్ సినిమాను ఒకప్పటి కాలంలో ఏలిన నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇతను నటించిన అన్ని సినిమాలు దాదాపు సూపర్ హిట్ గా నిలిచాయి. గత కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అతను కోల్కున్నారు అని కుటుంబ సభ్యులు చెప్పినప్పటికీ నేడు అనారోగ్యం మరింత వికటించడంతో మృతి చెందినట్లుగా మీడియా పేర్కొంది. ఇవాళ సాయంత్రం అతని అంతక్రియలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
Read also : ఇదేమి ఆట గురు.. ఇలానే ఆడితే భవిష్యత్తులో కష్టమే!
Read also : ఆపద వస్తే నేను ఉన్నానంటున్నా నకిరేకంటి మురళి కృష్ణ





