ప్రస్తుతం తెలంగాణలోని సికింద్రాబాద్ లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. కమ్మరి గూడలోని ముత్యాలమ్మ ఆలయం ధ్వంసం చేసినందుకు హిందూ సంఘాలు ధర్నాలు చేపట్టారు. దీంతో హిందూ సంఘాల ఆందోళనలును పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలోనే హిందూ సంఘాలు పోలీసులు పై చెప్పులు, కుర్చీలు విసిరారు. దీంతో పోలీసులకు అలాగే ఆందోళనకారులకు మధ్య భారీ వాగ్వాదం అనేది జరిగింది. ఇక తీవ్ర ఆగ్రహానికి గురి అయినటువంటి పోలీసులు ఆందోళనకారులపై లాటి చార్జ్ అనేది చేశారు.
ఈమధ్య సికింద్రాబాద్లోని కమ్మరిగూడలో ఉన్నటువంటి ముత్యాలమ్మ ఆలయంలోని అమ్మవారిని సలీం అనే వ్యక్తి కాల్ తో తన్ని విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇందులో భాగంగానే హిందూ సంఘాలు ఆందోళనకు దిగి భారీ ధర్నాలనేవి చేసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు మరియు ఆందోళనకారుల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. మరోవైపు మతఘర్షణలు చెలరేగకుండా సికింద్రాబాద్‌తొ పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు సమాచారం.