
మర్రిగూడ(క్రైమ్ మిర్రర్): మండలంలోని వట్టిపల్లి పాఠశాల అధ్యాపక బృందం ముందస్తు బడిబాట కార్యక్రమంలో భాగంగా, వట్టిపల్లి గ్రామపంచాయతీలో గడపగడపకు తిరుగుతూ, ప్రభుత్వ పాఠశాల గొప్పతనం, పాఠశాలలో జరుగుతు న్న ఇంగ్లీష్ మీడియం బోధన, చదువుతో పాటు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, స్కూల్ డ్రస్ లు, పౌష్టిక ఆహారం, మధ్యాహ్న భోజనంగా, వారానికి మూడుసార్లు గుడ్లు అందిస్తున్నామని ప్రజలకు తెలియజేసారు..
పేద మధ్య తరగతి కుటుంబాలు ప్రైవేట్ పాఠశాలలకు వారి పిల్లలను పంపిస్తే భట్టీ విధానమైన విద్యను అందిస్తున్నారని, తద్వారా నాణ్యమైన విద్యను అందించలేకపోతున్నారని, తల్లిదండ్రులు ఆర్థికంగా నష్టపోతున్నారని, గ్రామంలోని పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.. మన గ్రామంలోని మన ప్రభుత్వ పాఠశాలను కాపాడుకునే బాధ్యత మనదేనని, పాఠశాలలో అధ్యాపక బృందం సరిపడా ఉన్నారని, పిల్లల బంగారు భవిష్యత్తుకై ప్రభుత్వ పాఠశాలకు పంపాలని కోరారు. గురువారం 20 మంది విద్యార్థులను పాఠశాలలో చేర్పించే విధంగా నమోదు చేసుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్వాయి వెంకట్ రెడ్డి, ఎస్. నాగయ్య, డి. మంజులత, డి. బాలాజీ నాయక్, కె. లక్పతి, అర్. పల్లవి, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి ..
-
తెలంగాణలో ఫ్రూట్ జ్యూస్ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం.
-
మర్రిగూడ ఎంపిడివో రాజకీయం..!రాజకీయంగా మారిన కరువు పని?
-
కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!
-
కోమటిరెడ్డిపై గుత్తా తిరుగుబాటు.. రెండుగా చీలిన నల్గొండ కాంగ్రెస్?
-
ఆస్తి కోసం కూతురును చంపి సవతి తల్లి.. నదిలో పాతి పెట్టిన వైనం!..