
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ప్రపంచ క్రికెట్ అభిమానులకు ఇది ఒక కిక్ ఇచ్చే న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మెన్స్ టి20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది అని.. ఇందులో ఎవరు గెలుస్తారు అని చాలామంది కూడా ఇప్పటినుంచే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వారందరికీ కూడా ఐసీసీ నేడు శుభవార్త చెప్పనుంది. మెన్స్ టి20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇవ్వాలా సాయంత్రమే విడుదల అయ్యే అవకాశం ఉంది అని పేర్కొన్నారు. ఈసారి మెన్స్ టి20 వరల్డ్ కప్ 2026 శ్రీలంక మరియు భారత్ రెండు దేశాల వేదికలుగా జరగనున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇవాళ సాయంత్రం 6:30 గంటలకు మ్యాచ్లు అదేవిధంగా వేదికల వివరాలను విడుదల చేయనున్నారు. వీటిని ప్రత్యేకంగా రోహిత్, సూర్య కుమార్ యాదవ్, శ్రీలంక ప్లేయర్ మాథ్యూస్ అలాగే భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ తో ఐసీసీ రివీల్ చేస్తుంది అని సమాచారం. ఇక భారత్ మరియు శ్రీలంక సంయుక్తంగా జరగబోయేటువంటి ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొంటాయి. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య జరగబోయేటువంటి ప్రతి మ్యాచ్ కూడా శ్రీలంకలో జరగనున్నాయి. ఇక మిగతా అన్ని మ్యాచ్లు కూడా ఇండియాలోనే జరుగుతాయని ఐసీసీ వెల్లడించింది. ఇక టీమిండియా ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనుంది. ఎందుకంటే గత ఏడాది జరిగిన ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా పై భారత్ ఏడుపురుగుల తేడాతో ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో సాయంత్రం విడుదలవ్వబోయేటువంటి షెడ్యూల్ కోసం చాలామంది ఇప్పటికే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read also : Polished Rice: పాలిష్ బియ్యం తింటే కలిగే నష్టాలేంటో తెలుసా?
Read also : Big Breaking: ఇళ్లను అమ్మినా లేదా అద్దెకు ఇచ్చినా ఇక జైలుకే…!





