
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ప్రస్తుత రోజుల్లో కాలానికి అనుగుణంగా లేకపోవడం లేదా ఆహారంలో పలు మార్పులు తీసుకోవడం వల్ల శరీరంలో చాలానే మార్పులు వస్తూ ఉంటాయి. అయితే తాజాగా డాక్టర్లు తెలిపిన ఒక విషయంపై ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి అని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇంతకు అదేంటంటే… ఇప్పటి రోజుల్లో కిడ్నీ సమస్యలు చాలా మందిలోనూ కనిపిస్తున్నాయి. ఈ కిడ్నీ సమస్యలను చాలామంది త్వరగా గుర్తించకపోవడం వల్లే ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కోసారి ఈ సమస్యలను గుర్తించకపోవడం వల్ల.. అనుకోకుండా క్షణాల్లోనే ఆసుపత్రులు పాలై చనిపోయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే శరీరంలో కొన్ని మార్పులు వస్తే జాగ్రత్తలు వహించాలి అని డాక్టర్లు చెబుతున్నారు.
Read also : ఘోర పరాజయంతో చెత్త రికార్డును మూటగట్టుకున్న సౌత్ ఆఫ్రికా?
ఇంతకు ఏంటి ఆ మార్పులు అనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాత్రి వేళల్లో అతి తక్కువ లేదా అతి ఎక్కువ మూత్రం వస్తే కనుక కచ్చితంగా కిడ్నీ సమస్యలు ఉన్నాయని గుర్తించాలని డాక్టర్లు చెబుతున్నారు. అదేవిధంగా మూత్రంలో నురుగు, ఎర్రటి రంగు లేదా ముఖం మరియు పాదాలు వాచినట్లు కనిపిస్తే ఖచ్చితంగా జాగ్రత్త పడి డాక్టర్లను సంప్రదించాలి అని హెచ్చరిస్తున్నారు. అలాగే బీపీ పెరుగుతున్న కూడా కిడ్నీ సమస్యలుగా గుర్తించాలి అని డాక్టర్లు తెలిపారు. కావున ఇటువంటి సందర్భంలోనే అనుకోకుండా మీ శరీరంలో మార్పులు చోటు చేసుకుంటే ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అంటున్నారు. ప్రస్తుత రోజుల్లో చాలామంది కిడ్నీ సమస్యలను త్వరగా గుర్తించకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి అనుకోకుండా త్వరగా శరీరంలో ఏమైనా మార్పులు వస్తే వెంటనే వాటిని గమనించి వాటికి తగ్గ వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం బెటర్ అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Read also : రేపే ప్రీమియర్స్.. ఎల్లుండి విడుదల.. 14 రీల్స్ ప్లస్ కీలక ప్రకటన!





