
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ : వట్టిపల్లి మాజీ సర్పంచ్ ఎడ్ల శ్రీరాములు కుమారుడు ఎడ్ల పవన్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. పవన్ ప్రస్తుతం హైదరాబాద్ బియన్ రెడ్డి నగర్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆసుపత్రికి చేరుకొని పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నాడు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. అనంతరం ఎడ్ల శ్రీరాములు ను పరామర్శించి మనోధైర్యాన్ని ఇచ్చాడు. భగవంతుడి దయవల్ల పవన్ ఆరోగ్యం కుదుటపడుతున్నదని ఎలాంటి ఆందోళన చెందవద్దని శ్రీరాములు కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇచ్చాడు.
ప్రతి ఒక్కరికి మెరుగైన కంటి చూపు వచ్చేంతవరకు ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తా: కోమటిరెడ్డి
ఆయన వెంట మాజీ ఎంపీపీ మెండు మోహన్ రెడ్డి, మాల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దంటు జగదీశ్వర్, రైతుబంధు సమితి మండల మాజీ కన్వీనర్ బచ్చు రామకృష్ణ, సహకార సంఘం చైర్మన్ బాల నరసింహ, సీనియర్ నాయకుడు రామిడి వెంకటరమణారెడ్డి,మాజీ ఎంపీటీసీ పూరిపక్క సరితానగేష్, ఐలి లక్ష్మీనరసింహ గౌడ్, మలిగిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, చెరుకు లింగం గౌడ్, ఉన్నారు.