* పార్టీ మైనార్టీ నాయకుల ఇళ్లకు వెళ్లి శుభాకాంక్షలు చెప్పిన భూపాల్ రెడ్డి
* భూపాల్ రెడ్డిన సన్మానించిన ముస్లీం నాయకులు
క్రైమ్ మిర్రర్, నల్లగొండ: నల్లగొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. పలువురు బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నేతల ఇళ్లకు వెళ్లి ఈద్ ముబారక్ చెప్పారు. ముస్లీంలు అత్యంత పవిత్రంగా భావించే ఈ పర్వదినం అందరికీ శుభం చేకూర్చాలని ఆకాంక్షించారు. ముందురోజు ఉగాది, మరుసటి రోజు రంజాన్ రావడం మతసామరస్యానికి ప్రతీకగా భూపాల్ రెడ్డి అభివర్ణించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన భూపాల్ రెడ్డి.. ముస్లీంలు అంతా భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. రంజాన్ సందర్భంగా పార్టీ మైనార్టీ నాయకుల ఇళ్లకు వెళ్లి, వారి కుటుంబ సభ్యులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ముస్లీం కుటుంబాలు భూపాల్ రెడ్డిని శాలువాలు, బొకేలతో సన్మానించారు. పాయసాలు అందించారు. పండుగ సందర్భంగా తమ ఇంటికి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
అటు ఈ వేడుల్లో కంచర్ల భూపాల్ రెడ్డితో పాటు మాజీ మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, నల్లగొండ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు భోనగిరి దేవేందర్ టౌన్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్పొరేటర్లు మారగోని గణేష్, బాణావత్ దీప్లా నాయక్, ప్రవీణ్ రెడ్డి, పెరికే యాదయ్య, పేర్ల అశోక్, గోపగోని రాజశేఖర్ గౌడ్, రత్నగిరి శ్రీనివాస్, పెరిక కరణ్ జయరాజ్, కందుల లక్ష్మయ్య, మాతంగి అమర్ సహా పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
