
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రులు మరియు ఎమ్మెల్యేలు ఇవాళ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భాగంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం భద్రత కల్పించాలని కోరారు. నిన్న గుంటూరు మిర్చి యార్డ్ పర్యటన సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అసౌకర్యవంతంగా, అలాగే కనీస భద్రత కూడా లేని విషయం మనందరికీ తెలిసిందే. గతంలోనూ జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించకుండా ఉన్న సంఘటనలు చాలానే ఉన్నాయని గవర్నర్ అబ్దుల్ నజీర్ కు విన్నపించారు. ఇక జగన్ రక్షణ పై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి అంబటి రాంబాబు మరియు మెరుగ నాగార్జున,ఎవెల్లంపల్లి శ్రీనివాసులు అన్నారు.
కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం భారీ మెజారిటీతో గెలిచి అధికారాన్ని చేదక్కించుకొని ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భద్రత విషయంలో లోటుపాట్లు ఏర్పడ్డాయి. జగన్ ఎక్కడికి వెళ్ళినా కూడా భారీగా జనాలు రావడంతో జగన్ కి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక నిన్న గుంటూరు మిర్చి యార్డు పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి వెంట అతని బాడీగార్డ్లు తప్ప పోలీసులు ఎవరూ కూడా లేరు. ఈ నేపథ్యంలోనే వైసీపీకి సంబంధించి ఎమ్మెల్యేలు మరియు మంత్రులు గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సమావేశమయ్యి జగన్కు భద్రత కల్పించాలని కోరారు.
ఇవి కూడా చదవండి
1.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మంత్రి పొంగిలేటి సెటైర్లు!..
2.బాధితునిపై మద్దూర్ ఎస్సై దాడి… పోలీస్ స్టేషన్ ఎదుట రెండు గంటల పాటు ధర్నా చేసిన పలు సంఘాల నాయకులు!
3. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది!… 100% అధికారంలోకి నేనే వస్తా : KCR