
క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్ :-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీ ని నిర్వహించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 16,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. ఏపీ మెగా డీఎస్సీలో ఎంపికైన నూతన టీచర్లు నేడు ఆయా పోస్టింగ్ స్కూళ్లలో విధుల్లోకి చేరనున్నారు. ఇక దాదాపు పది రోజుల నుండి ట్రైనింగ్ తీసుకున్నటువంటి ఈ నూతన టీచర్లు నేడు విధుల్లోకి చేరుతుండడంతో వారి సంతోషాలకు అవధులు లేకుండా పోయాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీలో ఎంపికైన నూతన టీచర్లు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మరోవైపు వివిధ శాఖలో పనిచేస్తూ జాబ్ సాధించిన వారు కూడా అక్కడ రిజైన్ చేసి ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతలు చేపడుతున్నారు. నిన్న, మొన్నటి వరకు ఈ మెగా డీఎస్సీలో ఎంపికైన నూతన టీచర్లు ఎన్నో కష్టాలు పడ్డామని, అవన్నీ దాటుకొని నేడు ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టబోతున్నామని ఎనలేని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేము అని కూడా చెప్తున్నారు. మెగా డీఎస్సీ లో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం పట్ల ఇప్పటికే నూతన టీచర్ల తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఉపాధ్యాయ వృత్తికి మరింత విలువ తెచ్చేలా భవిష్యత్తు భావిభారత పౌరులను తీర్చిదిద్దే విధంగా మా టీచర్ల వృత్తికి కృషి చేస్తామని నూతన టీచర్లు చెప్తున్నారు. మరోవైపు ఉన్నత విద్యాధికారులు కూడా ఈ నూతన టీచర్లకు కొన్ని సూచనలు చేశారు.
Read also : ఏంటి.. ఎల్లమ్మ సినిమాలో హీరోగా నితిన్ కాదా?
Read also : నిర్మాణం జరుగుతున్న ఇంట్లో వందల ఓట్లు.. జూబ్లీహిల్స్ కలకలం