
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలుగు ప్రముఖ యాంకర్ శివ జ్యోతి తిరుమల ప్రసాదం పై అపహాస్యం చేసిన విషయం నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆమె తిరుపతిలో తన తమ్ముడితో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం స్వామివారి ప్రసాదం తీసుకుంటున్న సందర్భంలో ‘అడుక్కుంటున్నాడు’ అనుకుంటూనే తిరుమల లో ‘రిచెస్ట్ బిచ్చగాడు’ అంటూ తిరుమల ప్రసాదం పై అలాగే బిచ్చగాడు అంటూ అపహాస్యం చేసిన శివ జ్యోతి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆమెపై వెంకన్న స్వామి భక్తులు తీవ్రంగా విమర్శలు చేశారు. లడ్డు విషయంలో అవమానించడం ఏంటి అని.. శివ జ్యోతి పై తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని ఇలా నిన్నటి నుంచి అవివాదం కొనసాగుతున్న వేళ తాజాగా… అవివాదంపై ఆమె స్పందించారు.
Read also : అనారోగ్యంతో ఉన్న హిడ్మా చికిత్స కోసం వస్తే కాల్చి చంపేస్తారా..?
తిరుమల ప్రసాదం పై నేను మాట్లాడినటువంటి మాటలు ఎవరినైనా హట్ చేసుంటే క్షమించాలి అని యాంకర్ శివజ్యోతి భక్తులను కోరారు. పదివేల రూపాయల క్యూ లైన్ లో నిలుచున్నాము అన్న ఉద్దేశంతోనే అలా అన్నాను అని నేను వేరే తప్పుడు ఉద్దేశంతో అనలేదని చెప్పుకొచ్చారు. ఇవాళ మేము అనుభవించేది అంతా కూడా వెంకన్న దయవల్లే అని నా తమ్ముడు సోను అలాగే నా తరఫున ప్రతి ఒక్కరికి క్షమాపణలు చెబుతున్నా అని ఆమె వివరణ ఇచ్చారు. తెలిసో తెలియక ఒక పొరపాటు అయితే జరిగింది.. నా నుంచి తప్పుడు మాటలైతే వచ్చాయి… అందుకే ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి కూడా క్షమాపణలు కోరుతున్నానని ఆమె అన్నారు.
Read also : అనారోగ్యంతో ఉన్న హిడ్మా చికిత్స కోసం వస్తే కాల్చి చంపేస్తారా..?





