
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- మన భారతదేశంలో వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. వివిధ కాలాలను బట్టి పరిస్థితులు అంతకుమించి పోతున్నాయి. ప్రస్తుతం చలికాలం నెలకొన్న సందర్భంలో సాధారణ చలి కంటే ఎక్కువగానే చలి నమోదవుతుంది. మరోవైపు వేసవి కాలం వస్తే.. సాధారణ ఉష్ణోగ్రతలు కంటే ఇంకా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలా ప్రతి సీజన్ లో కూడా ఉండాల్సిన ఉష్ణోగ్రతలు కంటే ఎక్కువగా.. లేదా అత్యల్ప తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాజాగా ఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (CSE) స్టడీలో ఈ కీలక విషయం వెల్లడించబడింది. ఈ ఏడాది జనవరి మరియు సెప్టెంబర్ మధ్య కాలంలో 273 రోజుల్లో 270 రోజులు తీవ్ర వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి అని ఈ స్టడీలో వెల్లడించడమైనది. ఈ ప్రభావంతో దేశంలో 4,000 మందికి పైగా అనూహ్యంగా చనిపోయారు అని.. మరోవైపు 2.34 కోట్ల ఎకరాల్లో భారీగా పంట నష్టం కూడా సంభవించింది అని ఈ స్టడీలో పేర్కొన్నారు. దీని ద్వారా మన దేశంలో ప్రకృతి విపత్తులు కూడా బాగానే సంభవిస్తున్నాయి. మరి ఈ పరిస్థితులు ఎలా మారుతాయి అనేది భవిష్యత్తు రోజుల్లో చూడాల్సి ఉంది.
Read also : భూముల రిసర్వే రెండేళ్లకు పెంచేలా కసరత్తు : డిప్యూటీ స్పీకర్
Read also : Ilaiyaraaja: సోషల్ మీడియాలో ఇళయరాజా ఫొటో వాడొద్దు, హైకోర్టు తీర్పు!





