
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా జగన్ అలాగే తన వైసీపీ పార్టీ ప్రతిదీ రాజకీయమే చేస్తుంది అని మరోసారి టీడీపీ మండిపడింది. జగన్ కు మానవత్వం అనేదే లేదని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వేదికగా విమర్శించింది. నిన్న శ్రీకాకుళంలో జరిగినటువంటి కాశీబుగ్గ తొక్కిసలాటలో దాదాపు తొమ్మిది మందికి పైగా మృతి చెందడం, మరి కొంతమంది గాయాలు పాలు అవ్వడం రాష్ట్రవ్యాప్తంగా ఈ విషయం సంచలనం సృష్టించడం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ ఘటనకు కూటమి ప్రభుత్వ వైఫల్యమే కారణం అంటూ ఆ కాశి బుగ్గ దేవాలయ ధర్మకర్త మాట్లాడిన వీడియోను వైసీపీ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పోలీసులకు రక్షణ కల్పించాలి అని నిన్ననే సమాచారం ఇచ్చారని ఈ వీడియోలో ధర్మకర్త చెప్పారు. అయితే మరోసారి తొక్కిసలాట గురించి పోలీసులకు నేను వెంటనే సమాచారం ఇవ్వలేదు అని ఈ గుడి ధర్మకర్తనే మళ్లీ స్వయంగా మీడియా వేదికగా చెప్పడంతో ఈ ట్వీట్ ను మళ్లీ రిపీట్ చేసి తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం జరిగింది. ఒక ప్రైవేట్ వ్యక్తి నడిపే గుడిలో ప్రమాదాలను కూడా శవ రాజకీయం చేస్తున్నావంటే నిన్ను చూసి రాబందులు కూడా సిగ్గుపడతాయి జగన్ అంటూ తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసింది. జగన్ కు మానవత్వం లేదు అని ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది అని… ఆయన చేస్తున్నటువంటి శవరాజకీయాలే మరొకసారి ప్రజలకు తెలుస్తున్నాయి అని తీవ్రంగా ఫైర్ అయింది. కాగా కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి కర్నూలు బస్సు దగ్ధం ఘటన, నిన్న జరిగినటువంటి కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన పక్క ద్రోవ పట్టించడానికే జోగి రమేష్ ను అరెస్ట్ చేశారని జగన్ ఆరోపించిన విషయం కూడా అందరికీ తెలిసిందే.
Read also : బిగ్ బాస్ లో నుంచి మరో వైల్డ్ కార్డు అవుట్.. దడ పుట్టిస్తున్న ఇంటర్వ్యూ?
Read also : ఘోర రోడ్డు ప్రమాదం… కంకర లోడు టిప్పర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు… డ్రైవర్ మృతి!





