
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :-పులివెందులలో జడ్పిటిసి ఎన్నికలు జరుగుతున్న వేళ చాలామంది అభ్యర్థులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా పులివెందుల జడ్పిటిసి వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి… తన ఇంటి చుట్టూ చాలామంది తెలియని వ్యక్తులు కర్రలతో ఓటర్లను బెదిరిస్తున్నారని ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఏజెంట్లను పోలింగ్ బూత్ లోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద బయట వ్యక్తులు ఎలాంటి పర్మిషన్ తీసుకుని.. డిన్నర్ ఏర్పాటు చేసుకుంటారని.. దీనికి పోలీసులు ఎలా అనుమతి ఇచ్చారన్నది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది అని అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగితే కచ్చితంగా విజయం నాదే అని వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Read also: నేటి ముఖ్యంశాలు.. మీ క్రైమ్ మిర్రర్ వెబ్సైట్ లో..
కాగా పులివెందుల మరియు ఒంటిమిట్ట జడ్పిటిసి స్థానాల్లో ఇప్పటికే పోలింగ్ ప్రారంభమై అయింది. పోలీసులు భారీ బందోబస్తుతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి రెండు మండలాల్లో కలిపి ఏకంగా 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పులివెందులలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మరి కొంతమంది కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి మరియు వైసీపీ నేత సతీష్ రెడ్డి ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎలాంటి నిరసనలు, అల్లర్లు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ పోలింగ్ ను సజావుగా నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. దీంతో ఏ క్షణం ఏం జరగబోతుందో అని.. ఒకవైపు కార్యకర్తలు మరోవైపు పులివెందుల ప్రజలు కూడా టెన్షన్ టెన్షన్ గా ఉన్నారు.
Read also : వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్, పులివెందులలో టెన్షన్ టెన్షన్!