
నారాయణపేట, క్రైమ్ మిర్రర్:-క్షయ వ్యాధి నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి సూచించారు. ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా నారాయణపేట జిల్లా వైద్య, ఆరోగ్య కేంద్రంలో సోమవారం క్షయ వ్యాధి రోగులకు వ్యాధి నివారణకు సంబంధించిన కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ క్షయ వ్యాధి నివారణకు ప్రభుత్వంతో పాటు అందరూ కృషి చేయాలని అన్నారు.
పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు!.. తమిళ ప్రజలు కోరుకుంటే కచ్చితంగా పార్టీని స్థాపిస్తా?
క్షయ వ్యాధి బారినపడిన వారు ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు తీసుకుంటూ వ్యాధి నయం అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంతకుముందు రాజ్ కుమార్ రెడ్డిని డి.ఎం.హెచ్.ఓ. డాక్టర్ కె.సౌభాగ్యలక్ష్మి, వైద్యులు శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాఘవేందర్ రెడ్డి, సూర్యకాంత్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, ప్రసాద్, అధిక సంఖ్యలో పారామెడికల్ సిబ్బంది, రోగులతో పాటు కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, మధుసూదన్ రెడ్డి, హన్మంత్, శ్రీనివాస్ రెడ్డి, వై.సంతోష్, నర్సింహులు, ఎం.సంతోష్ తదితరులు పాల్గొన్నారు.