
గండిపేట్,క్రైమ్ మిర్రర్:- ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రిటైర్డ్ డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. బుధవారం ట్రాఫిక్ మేనేజ్ మెంట్ పై ప్రొబేషనరీ డిఎస్పీలకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో అవగాహన కల్పించారు. అందులో భాగంగా 112 మంది ప్రొబేషనరీ డీఎస్పీలకు ట్రాఫిక్ మేనేజ్ మెంట్ లో తెలంగాణ పోలీసులు నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను రిటైర్డ్ డీజీపీ డాక్టర్ జితేందర్ వివరించారు. ప్రొబేషనరీ డీఎస్పీ లకు శిక్షణలో భాగంగా సీనియర్ పోలీసు అధికారులతో నిర్వహించే కార్యక్రమాలలో బాగంగా పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ సైతం జితేందర్ తో కలిసి పాల్గొన్నారు. మాజీ డీజీపీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో ట్రైనీలకు ట్రాఫిక్ మేనేజ్ మెంట్ పై తెలంగాణ ప్రభుత్వం న్యూ టెక్నాలజీ ద్వారా రాష్ట్రంలో ప్రజలకు ట్రాఫిక్ లో సాఫీగా, భద్రతతో ఇంటికి చేరేవిధంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను సవివరంగా తెలియచేశారు. రోడ్డు ప్రమాదాలు నివారించడానికి, ప్రజల ప్రాణాలు కాపాడటానికి పోలీసులు టెక్నాలజీ వినియోగించి చేస్తున్న కార్యక్రమాలను అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కోర్సు కో ఆర్డినేటర్ గంటా వెంకట్రావు, అసిస్టెంట్ డైరెక్టర్ నరహరి, ట్రైనీ ఆఫీసర్స్, ఇండోర్, ఔట్ డోర్ సిబ్బంది పాల్గొన్నారు.
Read also : రాజేంద్రనగర్, అత్తాపూర్ సర్కిళ్లను సైబరాబాద్ కమిషనరేట్ లోనే కొనసాగించాలి : అక్కెం రఘు
Read also : Maharashtra Politics: మహారాష్ట్రలో బీజేపీ-కాంగ్రెస్-ఎంఐఎం పొత్తు, నిప్పులు చెరిగిన సీఎం ఫడ్నవీస్!





