
నారాయణపేట, క్రైమ్ మిర్రర్:ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి సూచించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని శాసనపల్లి రోడ్డులో ఉన్న ఉసిర్ల హనుమాన్ దేవాలయం ముందు భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.1.25 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన ధ్వజస్తంభాన్ని హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం రాజ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉసిర్ల హనుమాన్ ఆలయం వద్ద ధ్వజస్తంభం లేదని గతకొన్ని రోజుల క్రితం నిర్వాహకులు తమను కలిసి విన్నవించారని తెలిపారు. రూ.1.25 లక్షలతో నూతనంగా ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేయించి ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. అంతకుముందు హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు రాజ్ కుమార్ రెడ్డిని, ఫౌండేషన్ సభ్యులను శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ నిర్వాహకులు సరాఫ్ నాగరాజు, కొన్నంగిరి హన్మంతు, లక్షణ్, నారాయణ, ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, బాలాజీ, పోలీసు పటేల్ మధుసూదన్ రెడ్డి, హన్మంతు, రుద్రారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఎం.సంతోష్, గోపాల్ గౌడ్, అశోక్, వై.సంతోష్, నర్సింహనాయుడు, చల్లా వెంకటేష్, గోపాల్, శివరాజ్, వంశీరెడ్డిలతో పాటు హరికృష్ణ ప్రభూజీ, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఆస్తి కోసం కూతురును చంపి సవతి తల్లి.. నదిలో పాతి పెట్టిన వైనం!..
పాములపహాడ్ ఐకెపి కేంద్రంలో ప్రమాదం… ముగ్గురు హమాలీలకు తీవ్ర గాయాలు!..