
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- వైసీపీ నేత, మాజీమంత్రి రోజా కూటమి పై విమర్శలతో మరోసారి వార్తలలో నిలిచారు. నిన్న మొన్నటి వరకు ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ కార్యక్రమాలు చేయగా ఈరోజు ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు వ్యవస్థపై తీవ్రస్థాయిలో మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మన భారతదేశంలోనే అట్టడుగు స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ ఉంది అని రోజా ఎద్దేవా చేశారు. తాజాగా కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ చివరి అంచుల స్థానంలో ఉండగా ఈ నివేదికను చూసి సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత సిగ్గుపడాలి అని వ్యాఖ్యానించారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖను చూసి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు నవ్వుతున్నారు అని రోజా పోలీస్ శాఖ పై విమర్శలు గుప్పించారు.
Read also : ఈసారి సంక్రాంతి పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?
తాజాగా నెల్లూరు జైలులో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలాగే తన సోదరుడిని పరామర్శించిన రోజా అనంతరం పోలీస్ శాఖను ఉద్దేశించి ఇటువంటి ఆరోపణలు చేశారు. నేడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలను అక్రమ కేసులతో తీవ్రంగా వేధిస్తోంది అని ఆరోపించారు. పోలీసులందరూ కలిసి నీళ్లు లేని బావిలో దూకి చావాలి అని రోజా సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో చంద్రబాబు ను అక్రమంగా అరెస్టు చేసినప్పుడు పోలీసులు ఎలాంటి తీరు వ్యవహరించారో మర్చిపోయారా రోజా.. ఒక నేరస్తుడిని పోలీసులు అరెస్టు చేసిన తప్పేనా అంటూ కొందరు కూటమికి సపోర్ట్ చేస్తూ కామెంట్లు చేస్తుండగా ఇంకొందరు ఏ ప్రభుత్వం వచ్చినా పోలీసులు మాత్రం ఆ ప్రభుత్వం చెప్పినట్లు చేస్తున్నారు అని.. ఎవరు కూడా న్యాయంగా తమ బాధ్యతలను నిర్వహించట్లేదు అని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఇప్పుడు రోజా చేసిన వ్యాఖ్యలపై కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
Read also : మందమర్రికి కొత్త ఆర్టీసీ బస్సు.. మంత్రి వివేక్ చేతుల మీదుగా ప్రారంభం





