
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మెల్లిమెల్లిగా హీట్ ఎక్కుతున్నాయి. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అలాగే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వేళ రాష్ట్రంలో రాజకీయంగా గందరగోళం పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్రంగా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా ఆటో డ్రైవర్లను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది అని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఆటోడ్రైవర్లకు ప్రతి ఏడాది కూడా 12000 ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం పట్ల హరీష్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలనలో అనేక మంది డ్రైవర్లు సూసైడ్ చేసుకుంటున్న సందర్భాలు చూస్తున్నాము అని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లకు 1500 కోట్ల అప్పు ఉందని గుర్తు చేశారు. నేడు గోకుల్ థియేటర్ నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించిన హరీష్ రావు తరువాత ఆటోడ్రైవర్లతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కారం కాకపోతే మాత్రం ఖచ్చితంగా లక్ష ఆటోలతో ఆందోళన చేపడుతామని మరోవైపు తలసాని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీంతో రాష్ట్రంలో అధికార మరియు ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు తారస్థాయికి చేరుతున్నాయి. మొన్నటికి మొన్న పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని దోచుకుంది అని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేయగా… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి ప్రజలందరినీ మోసం చేశారంటూ బిఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఆరోపణలు చేయడం రాజకీయంలో కొత్త ఏమి కాదంటూ మరి కొంతమంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Read also : చేతిలో హారతి వెలిగించి మరీ.. ఏ తప్పు చేయలేదు అంటున్నా జోగి రమేష్
Read also : టీమిండియాకు బిగ్ షాక్… ICUలో స్టార్ క్రికెటర్!





