
పవన్‌కళ్యాణ్ కన్నెర్రజేశారు. టీడీపీ ఎమ్మెల్యేకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎక్కువ చేస్తే.. ఊరుకోనంటూ హెచ్చరించారు. తప్పుచేస్తే నేనైనా… ముఖ్యమంత్రి అయినా బాధ్యులే అని.. నువ్వెంత అంటూ ఆ ఎమ్మెల్యేపై ఫైరయ్యారు. ఇంతకీ.. ఆ ఎమ్మెల్యే ఎవరు..? ఏం చేశారు..? పవన్ కళ్యాణ్ ఎందుకు అంతలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది.
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి… ఈయనకే పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చింది. అటవీ శాఖ అధికారులపై… ఎమ్మెల్యే దాడి చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ వరకు వెళ్లింది. అటవీశాఖ అధికారులతో ఎమ్మెల్యే ఎంత దారుణంగా ప్రవర్తించారో.. ఎలా దాడి చేశారో వీడియోలతో సహా చూసిన పవన్… ఉగ్రరూపంతో ఊగిపోయారు. ఎమ్మెల్యేపై సీరియస్ అయ్యారు. నేరం చేసి జైలుకు వెళ్తే ప్రధాని, సీఎంనే తొలగించే బిల్లు తెస్తుంటే.. నువ్వెంత అంటూ… ఆ ఎమ్మెల్యేను హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్.
అసలు ఏం జరిగిందంటే… ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి తన అనుచరులతో కలిసి తమపై దాడి చేశారని అటవీశాఖ అధికారులు తెలిపారు. తమను అర్థరాత్రి సమయంలో వాహనంలో ఎక్కించి రెండు గంటలపాటు అడవిలో తిప్పుతూ కొట్టారని చెప్తున్నారు. అంతేకాదు.. ఆ తర్వాత కూడా గెస్ట్‌హ్‌స్‌లో బంధించి దాడి చేశారన్నారు. ఎమ్మెల్యే అనుచరులు తమ వాకీటాకీలు, మొబైల్‌ఫోన్లు అన్నీ లాక్కున్నారని మీడియా ముందే చెప్పారు. దాడికి సంబంధించిన వీడియోలు, సీసీ ఫుటేజ్‌ను కూడా బయటపెట్టారు. ఈ ఘటనపై అటవీశాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేశారు. వీడియోలు, సీసీ ఫుటేజ్‌ను కూడా పంపారు. అది చూసి… పవన్ కళ్యాణ్ కోపం కట్టలు తెంచుకుంది. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డిపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యే తీరును విమర్శిస్తూ ట్వీట్ చేశారు.
పవన్ కళ్యాణ్ ట్వీట్‌లో ఏముందంటే… చట్టాలను అతిక్రమించి క్రిమినల్ చర్యలకు పాల్పడే వారు… ఏ స్థాయిలో ఉన్నవారైనా ఉపేక్షించకూడదని, ప్రదానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా ఒకటే అని.. అరెస్టయిన 31వ రోజు పదవిని కోల్పోయేలా మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురాబోతోందని అన్నారు. అంతేకాదు.. మేము తప్పుచేసినా బాధ్యులను చేయని అసెంబ్లీలోనే సీఎం చంద్రబాబు, తాను స్పష్టం చెప్పామన్నారు. నిబద్దతతో, నియంత్రణతో విధులు నిర్వర్తిస్తున్నామన్నారు. ప్రజాజీవితంలో ఉన్నవారు ముందు తమను తాము నియంత్రిచుకోవాలని… ఉద్యోగుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించేవారు ఏ స్థాయిలో ఉన్నా.. కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని ట్వీట్‌లో పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. శ్రీశైలం అటవీ ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న అటవీ శాఖ ఉద్యోగులతో ఘర్షణ పడి, దాడికి పాల్పడిన ఘటనపై… ఉన్నతాధికారులు వివరంచారని… ఈ ఘటనలో ఎమ్మెల్యే, ఆయన అనుచరుల ప్రమేయంపై విచారణ జరిపి.. నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్టు చెప్పారు. బాధ్యులపై నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయాలని స్పష్టంగా చెప్పానన్నారు పవన్ కళ్యాణ్.
Also Read News