
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- సీపీఐ అగ్రనేత, ప్రజల వైపు నిలబడి పోరాడే వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ.. నిన్నటి రోజున తుది శ్వాస విడిచారు. అయితే మరణించిన తర్వాత అతని నేత్రాలను ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి డొనేట్ చేశారు. అలాగే తన భౌతికకాయాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి పరిశోధనల కోసం ఇవ్వనున్నారు. సురవరం సుధాకర్ రెడ్డి అభిమానులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా అతని భౌతిక కాయాన్ని సందర్శించిన తరువాత ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు హిమాయత్ నగర్ లోని మగ్దూం భవన్ లో సురవరం భౌతిక కాయాన్ని ఉంచుతారు. అనంతరం గాంధీ కాలేజీకి సురవరం శరీరాన్ని అప్పగిస్తారు. కాగా సుధాకర్ రెడ్డికి భార్యా, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రజలలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధాకర్ రెడ్డి ఇలా కళ్ళను, భౌతిక కాయాన్ని దానం చేసి ప్రజల మనసుల్లో నిలిచిపోయారు. దీంతో సుధాకర్ రెడ్డి చనిపోయిన.. ప్రజల మనసుల్లో బ్రతికే ఉంటారు చాలామంది ఆశిస్తున్నారు.
Read also: ధనిక ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించిన చంద్రబాబు.. దేశంలోనే నెం -1
హైదరాబాదులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. సురవరం సుధాకర్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, కొండ్రావు పల్లి లో మార్చి 25, 1942లో జన్మించారు. కర్నూల్ లో డిగ్రీ, హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్.ఎల్.బి పూర్తి చేసుకున్నారు. 1970లో AISF అధ్యక్షుడిగా, 1972లో AIYF అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు. 1998, 2004లో నల్గొండ పార్లమెంట్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక 2012లో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సురవరం సుధాకర్ రెడ్డి నియమితులయ్యారు.
Read also : తెలంగాణలో మరో కొత్త పార్టీ – పెట్టబోయేది ఎవరో తెలుసా…!