ప్రయాణికులకు శుభవార్త: కొత్తగా 13 బస్ స్టేషన్లు, 2 డిపోల ఏర్పాటు..!

క్రైమ్ మిర్రర్,తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని,ఆదాయ మార్గాలను పెంచుకోవడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా కొత్త మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేసే దిశగా లక్యంగా పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 కొత్త బస్ స్టేషన్ల నిర్మాణ పనులు ప్రస్తుతం చురుగ్గా సాగుతున్నాయి. వీటిలో ప్రధానంగా కాళేశ్వరం, మంథని, మధిర, ములుగు, కోదాడ మరియు హుజూర్ నగర్ వంటి ప్రాంతాల్లో నూతన బస్ స్టేషన్లను నిర్మిస్తున్నారు. పెద్దపల్లి మరియు ములుగు జిల్లాలోని ఏటూరునాగారంలో రెండు కొత్త బస్ డిపోల ఏర్పాటు పనులు సాగుతున్నాయి.

వీటి కోసం సుమారు రూ. 11.7 కోట్లు (పెద్దపల్లి) మరియు రూ. 6.28 కోట్లు (ఏటూరునాగారం) వెచ్చించనున్నారు. కొత్త నిర్మాణాలతో పాటు, రాష్ట్రంలోని దాదాపు 30 నుండి 39 పాత బస్ స్టేషన్లను ఆధునీకరించేందుకు ప్రభుత్వం సుమారు రూ. 108 కోట్ల నుండి రూ. 200 కోట్ల వరకు నిధులను మంజూరు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button