
క్రైమ్ మిర్రర్,వేములపల్లి:- నల్గొండ జిల్లా వేములపల్లి మండల వెలుగు శాఖ నూతన అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ (ఏపిఎం)గా ఎరుకల జానకి బాధ్యతలు స్వీకరించారు. డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీలో (డి ఆర్ డి ఎ) ఏపిఎంగా విధులు నిర్వర్తిస్తున్న ఆమెను బదిలీపై వేములపల్లి మండలానికి నియమించారు. వేములపల్లి మండలంలో ఏపిఎంగా పని చేసిన నిజాముద్దీన్ ను మిర్యాలగూడకు బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జానకి మాట్లాడుతూ “ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వేగంగా, పారదర్శకంగా అందేలా కృషి చేస్తాను” అని పేర్కొన్నారు..ఈ కార్యక్రమానికి మండల సమైక్య అధ్యక్షురాలు కొంచెం నాగమణి, సీసీలు గోపీనాథ్ ,రమణయ్య, సురేందర్ రెడ్డి, ఎంఎస్ అకౌంటెంట్ ఆపరేటర్ లు శుభాకాంక్షలు తెలిపినారు.
Read also : ట్రంప్ టారిఫ్ బెదిరింపులు.. తీవ్రంగా స్పందించిన భారత్!
Read also : భారత్ పై టారిఫ్ మరింత పెంచుతాం, ట్రంప్ సంచలన ప్రకటన!